Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఎం నేత తమ్మినేని…

సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు …సచివాలయంలో సీఎం ను ఆపార్టీ రాష్ట్ర నేతలను వెంట తీసుకోని వెళ్లిన తమ్మినేని సీఎంకు పూల బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు …అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ,కాంగ్రెస్ మధ్య పొత్తు బెడిసికొట్టిన నేపథ్యంలో సిపిఎం ఒంటరిగానే 19 నియోజకవర్గాల్లో పోటీచేసింది …ఎక్కడ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష పార్టీలతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు జరుపుతామని అందులో సభలో ప్రాతినిధ్యంలేని సిపిఎం ,ఎం ఎల్ పార్టీలను కూడా పిలుస్తామని ఒకటికి రెండు సార్లు అనడం ప్రాధాన్యత సంతరించుకుంది …దీంతో ఆపార్టీ నేతలు వచ్చి సీఎంను కలవడం ఆసక్తిగా మారింది …సీఎంను కలిసిన వారిలో తమ్మినేనితోపాటు , ఆపార్టీ రాష్ట్ర నేతలు ఎస్ .వీరయ్య , చెరుపల్లి సీతారాములు , పోతినేని సుదర్శన్… జూలకంటి రంగారెడ్డి , డి జి నరసింగరావు , తదితరులు ఉన్నారు …

కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో పట్టిన విధంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు …ఈమేరకు ఒక విజ్ఞాపన పత్రాన్ని సీఎం కు అందజేశారు …అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ,రైతు భరోసా వెంటనే ఇవ్వాలని ,అందులో పేర్కొన్నారు …200 యూనిట్లవరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు …,ఉద్యోగఖాళీలని భర్తీ చేయాలన్నారు … కాంట్రాక్టు ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని జర్నలిస్ట్ లకు ఇళ్లస్థల్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు …

Related posts

దసరా లోపు 11 వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తాం: రేవంత్ రెడ్డి

Ram Narayana

డీఎస్ లేని లోటు ఎవరూ తీర్చలేరు: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

కుతుబ్ షాహీపై పడిన పిడుగు.. బీటలు వారిన మినార్

Ram Narayana

Leave a Comment