రాష్ట్ర మంత్రి పొంగులేటి మనుమరాలితో మథుర క్షణాలు…
దుబాయ్ లో కుటుంబసభ్యులతో ఆటవిడుపు
బీచ్ లో తనవితీరా నవ్వుకుంటున్న మంత్రి
మొన్నటి వరకు ఎన్నికలు, వాటిలో గెలవడం..ఆపై మంత్రి కావడం… నిత్యం జనాల రద్దీతో బిజీబిజీగా ఉన్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాస్త ఆటవిడుపు తీసుకున్నారు… కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ సందర్శనకు వెళ్లారు … అక్కడ బీచ్ లో ఆయన మనమరాలు మైరారెడ్డితో మథుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు… ఆయన ఆనందం మాటల్లో చెప్పలేనంతగా ఉంది … దాదాపు నాలుగేళ్ల క్రితం వివాహమైన తన కుమారుడు హర్షారెడ్డి సోమారెడ్డి దంపతులు ఆరు నెలల క్రితం ఓ చిన్నారికి జన్మనిచ్చారు. ఆ పాపతో దుబాయ్ బీచ్ లో తాత చేస్తున్న ఎంజాయ్ మెంట్ తాలూకు దృశ్యం తాలూకా ఫోటో హైలెట్ గా ఉంది …అందులో తన మనవరాలు ఎంజాయ్ చేస్తున్న దృశ్యం మనస్ఫూర్తిగా మంత్రి నవ్వుకుంటున్న తీరు చూపరులను కట్టి పడేస్తుంది …