Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో సి సి ఏ ఆధ్వరంలో పాలస్తీనా కు సంఘీభావం…

ఇజ్రాయిల్ అమెరికా దేశాలు పాలస్తీనా ప్రజల పైన చేస్తున్న యుద్ధ ఉన్మాద దాడులను ఖండిస్తూ సి సి ఏ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. సీసీఏ (ప్రత్యామ్నాయ పౌర సమూహం) ప్రతినిధులు , వామపక్ష పార్టీలు , వివిధ ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు , అభ్యుదయవాదులు, పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ మానవహారాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా జరిగిన సభలో సీసీఏ ప్రతినిధులు డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్ , డాక్టర్ రవీంద్రనాథ్, రవి మారుత్,రెహానా బేగం , కాకి భాస్కర్, విజయ్ , శేషగిరిరావు, బండారు రమేష్ , సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు , రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ ,పొన్నం వెంకటేశ్వరరావు , సిపిఐ యం యల్ నాయకులు పాముల మోహన్ రావు తదితరులు ప్రసంగించారు. ఇజ్రాయిల్ , అమెరికాలు పాలస్తీనా లోని గాజా , ఇతర ప్రాంతాల పైన చేస్తున్నటువంటి దాడుల వలన పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని వాపోయారు. పౌర స్థావరాల పైన సైతం దాడులు జరగడం వలన అనేకమంది పౌరులు చనిపోతున్నారని , పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరుగుతోందని తెలిపారు.
పసిపిల్లలు , వృద్ధులు , మహిళలు నిస్సాహాయక స్థితిలో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను , ప్రపంచ దేశాల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా అమెరికా ఇజ్రాయిల్ దుర్మార్గంగా పాలస్తీనా పైన యుద్ధాన్ని చేస్తున్నాయని అన్నారు . ఈ యుద్ధ ప్రభావం కేవలం పాలస్తీనా వరకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపిస్తుందని , ఆర్థికంగా కూడా చాలా నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధ ఉన్మాదాన్ని ప్రపంచంలోని ప్రజాస్వామిక వాదులందరూ నిరసించాలని కోరారు. పాలస్తీనా ప్రజలకు ప్రపంచ ప్రజలు సంఘీభావంగా నిలబడాలని , వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. అంతర్జాతీయ సంస్థలు , ప్రపంచ దేశాలు అమెరికా ఇజ్రాయిల్ పైన ఒత్తిడి పెంచి యుద్ధ ఉన్మాదాన్ని ఆపేలా చేయాలని కోరారు.
ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ పౌర సమూహం ( సి సి ఏ ) ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు అండగా సంఘీభావ మానవహర కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వామపక్ష , ప్రజాసంఘ నాయకులు గోకినపల్లి వెంకటేశ్వర్లు, యర్రా శ్రీనివాసరావు సింగు నరసింహారావు,పోటు కళావతి ,ఆవుల అశోక్ ,ఝాన్సీ, మాదినేని రమేష్‌ , మెరుగు సత్యనారాయణ , జి.రామయ్య ,ఆకుల గాంధీ , ఆజాద్ , మస్తాన్, వెంకటేష్ ,మురళీ , యస్ యం.రఫీ , షేక్ మతీన్ , పిన్నింటి రమ్య , ఆర్.ప్రకాష్ , సమీ , వసామా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రధాని మోడీ బీసీలకు చేసిందేమిటి …కూరాకుల సన్మానసభలో ఎంపీ వద్దిరాజు

Ram Narayana

వైభవంగా వురిమళ్ల ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం

Ram Narayana

సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు దీక్ష పూనాలి …జిల్లా కలెక్టర్ మూజమ్మిల్ ఖాన్

Ram Narayana

Leave a Comment