Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బండి సంజయ్ మాటల వెనక మర్మమేంటి …?

బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు , ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి… పార్లమెంట్ ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి సర్కార్ ను కేసీఆర్ కూల్చే ప్రయత్నం చేస్తున్నారని పెద్ద బాంబ్ పేల్చారు …అందులో నిజమెంత …కేసీఆర్ కూల్చుతారా …? అంతా దైర్యం చేస్తారా …?లేక బీజేపీ ఆ ఆలోచనలు చేస్తుందా…? అనే అనుమానాలకు సంజయ్ వ్యాఖ్యలు తావు ఇచ్చాయి …గత పది సంవత్సరాల కాలంలో దేశంలో ఎన్నికైన అనేక ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది …అందుకు పెద్ద ఉదాహరణ మహారాష్ట్ర లో ఎకనాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటు …ఏ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా 40 మంది ఎమ్మెల్యేలను ఒక్కసారిగా శివసేన నుంచి మార్చి ,ఆపార్టీని చీల్చి ,బీజేపీ మద్దతుతో అక్కడ ఎకనాథ్ షిండే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దేశమంతా గమనించింది …అంతకు ముందు కర్ణాటక , మధ్యప్రదేశ్ , గోవా లాంటి రాష్ట్రాల్లో జరిగింది అదే … అందువల్ల ఆలాంటి ఆలోచనలు చేస్తే గిస్తే బీజేపీ చేస్తుందనేది పరిశీలకుల అభిప్రాయం …కేసీఆర్ కు ఇప్పట్లో ఆ అవకాశమే లేదు …ఒక వేల కేసీఆర్ చేసినా, దానివెనుక బీజేపీ ఉండే అవకాశాలే అధికంగా ఉన్నాయనే చెప్పాలి … అసలు కేసీఆర్ కు లేని ఆలోచనలు కల్పించేందుకు కావాలనే బండి సంజయ్ ఆమాటలు అన్నారా…?అనే అనుమానాలు కలుగుతున్నాయి…

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్ లో ఉన్నారని మరో మాట చెప్పారు …అంతే కాదు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆయన భావన …అందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ కదలికల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు … ఇది ఆలోచించాల్సిందే … అయితే ఒక్క కేసీఆర్ పట్ల జాగ్రత్తగా ఉండమని సంజయ్ అన్నారు ….బీజేపీ పట్ల అతి జాగ్రత్తగా ఉండాలని పరిశీలకుల అభిప్రాయం …పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ,బీఆర్ యస్ జట్టుకడతాయని లేదా ఎన్నికల అనంతరం బీఆర్ యస్ పార్టీ ఎన్డీయే లో చేరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి …మరో ప్రచారం కూడా ఉంది …పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ యస్ ఎన్డీయే లో చేరడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో చేరే అవకాశం కొట్టిపారేయలేమని రాజకీయపండితులు అభిప్రాయపడుతున్నారు … అందువల్ల బండి సంజయ్ వ్యాఖ్యలు బీజేపీ కోణంలో చేసి ఉండవచ్చునని కాంగ్రెస్ నేతల అభిప్రాయం … దీనిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు …బీఆర్ యస్ , బీజేపీ ఒక్కటేనని అభిప్రాయపడ్డారు …రెండు పార్టీలు కలిసి కుట్రలు చేసినా తెలంగాణ ప్రజాబలం ముందు వారి కుట్రలు సాగవని అన్నారు …

కేసీఆర్ ఇంకా ఓటమి నుంచి తేరుకోలేదు … ఆయన ఓడిపోతామని అనుకోలేదు …ఎన్నికల్లో ఆయన లెక్కతప్పింది … ఎన్నికల ఫలితాల షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు … ఆయన ఇప్పట్లో ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టె చర్యలకు పాల్పడితే ప్రజల్లో మరింత పలచబడి పోతారు …ఇది కేసీఆర్ కు కూడా తెలుసు … పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేసీఆర్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి….ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు …అనేదానిపై బీఆర్ యస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది …కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారని అంటున్న బండి సంజయ్ ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది చెప్పాల్సి ఉంది ..

Related posts

కాంగ్రెస్ గూటికి తుమ్మల …హైద్రాబాద్ నివాసంలో తుమ్మలతో రేవంత్ భేటీ …!

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి…కిషన్ రెడ్డి

Ram Narayana

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి: కేసీ వేణుగోపాల్ కీలక ప్రకటన

Ram Narayana

Leave a Comment