Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం… కవితకు ఈడీ నోటీసులు జారీ

  • రేపు ఉదయం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు
  • గత ఏడాది ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్సీ కవిత
  • ఈడీ నోటీసులపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గత ఏడాది మార్చి నెలలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు పంపించింది. రేపు ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఈడీ నాలుగుసార్లు నోటీసులు పంపించింది. మూడుసార్లు ఇచ్చిన నోటీసులకు కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 18న హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపించారు. అయితే తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. 

తాజాగా కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈడీ నోటీసులపై కవిత ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

రేపు నేను విచారణకు హాజరు కాలేను: ఈడీకి కవిత లేఖ

రేపు తాను విచారణకు హాజరు కాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రేపు ఉదయం విచారణకు హాజరు కావాలని ఈడీ కవితకు నోటీసులు పంపించింది. దీంతో కవిత హాజరు కాలేనని చెబుతూ ఈడీకి లేఖ పంపించారు. తనకు సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. తన కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. 16న ఉదయం విచారణకు హాజరు కావాలని కవితకు ఈ నెల 5వ తేదీనే ఈడీ నోటీసులు జారీ చేసింది.

లిక్కర్ కేసులో కవితను ఈడీ మూడుసార్లు విచారించింది. నాలుగోసారి నోటీసులు ఇవ్వడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలను ఇంటి వద్ద లేదా వీడియో విచారణ జరపాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కవితకు ఊరట లభించింది. ఈ క్రమంలో ఈడీ మరోసారి ఆమెకు నోటీసులు పంపించింది. కానీ తాను విచారణకు హాజరుకాలేనని కవిత స్పష్టం చేశారు.

Related posts

హరీశ్ రావుకు తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ వస్తుందన్న ‘ఆరా’ సంస్థ

Ram Narayana

నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం..!

Ram Narayana

కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వచ్చిన సిబ్బంది… పాముతో కరిపిస్తానంటూ మహిళ బెదిరింపు!

Drukpadam

Leave a Comment