తెలంగాణ వార్తలు

కర్ర సాయంతో మెల్లిగా నడుస్తోన్న కేసీఆర్… !

  • వైద్య సిబ్బంది సమక్షంలో కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్
  • వీడియోను పోస్ట్ చేసిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్
  • త్వరలో ప్రజల ముందుకు వస్తారన్న సంతోష్ కుమార్

గత నెలలో బాత్రూంలో జారిపడి గాయపడిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కర్ర సాయంతో నడుస్తోన్న వీడియోను రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలి వరకు కేసీఆర్ బెడ్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే వైద్య సిబ్బంది సమక్షంలో కర్ర సాయంతో నడుస్తున్నారు.

సంతోష్ కుమార్ పోస్ట్ చేసిన వీడియోలో… కేసీఆర్ ఓ ఊతకర్ర సాయంతో.. వైద్య సహాయకుడి సమక్షంలో మెల్లిగా అడుగులు వేస్తున్నారు. అలా తన ఇంటి హాలు మొత్తం నడిచారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సంతోష్ కుమార్…  ఆయన ప్రతి అడుగులో దృఢ సంకల్పం కనిపిస్తోందని… కర్ర సాయంతో నడుస్తున్నాడని… త్వరలో ప్రజల ముందుకు వస్తారని పేర్కొన్నారు.

Related posts

 వెంటిలేట‌ర్‌పై నటుడు ఫిష్ వెంక‌ట్‌ .. సాయం కోసం భార్య వేడుకోలు

Ram Narayana

శ్రీనివాస్ రెడ్డికి సుమన్ టీవీ చైర్మన్ శుభాకాంక్షలు

Ram Narayana

ధాన్యం బస్తాలో రూ. లక్షన్నర దాచిన భర్త … తెలియక అమ్మేసిన భార్య!

Ram Narayana