Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

టమాటాలు తింటే కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవిగో!

  • టమాటాలలో కొన్ని క్యాన్సర్ల ముప్పు నుంచి రక్షణ అందించే గుణాలు
  • దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుదల లక్షణాలు
  • టమాటాలను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్న వైద్య నిపుణులు

టమాటాలు కూరకు రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్ సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే లతో ఇవి నిండి వుంటాయి. అందుకే టమాటాలను ఆహారంతో కలిపి తీసుకుంటే కొన్ని విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వైద్య నిపుణులు చెబుతున్న 5 హెల్త్ బెనిఫిట్స్‌ను గమనిద్దాం..

బరువు తగ్గుదలలో కీలక పాత్ర
టమాటాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే నీటి పదార్థం ఎక్కువగా ఉండడంతో ఇది చక్కటి డైట్ ఫుడ్‌గా పనిచేస్తుంది.  బరువు తగ్గింపులో ఇది సహాయపడుతుంది. అందుకే ఏమైనా ఆహారంలో టమాటాలను తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం. టమాటాలలోని ఫైబర్ కంటెంట్ ఎక్కువసేపు ఆకలి కానివ్వదు. దీంతో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అనారోగ్యకరమైన చిరుతిండిని తినాల్సిన అవసరం ఉండదు. 

గుండె ఆరోగ్యానికి రక్షణ..
గుండె ఆరోగ్యంలో కూడా టమాటాలు కీలక పాత్ర పోషిస్తాయి. లైకోపీన్, పొటాషియం, విటమిన్ సీ వ్యక్తుల బీపీని కంట్రోల్ చేయడంలో, ధమనుల పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో టమాటాలను చేర్చుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.

క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ
టమాటాలలో కీలకమైన ‘లైకోపీన్’కు కొన్ని క్యాన్సర్ల ముప్పును తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పుపై ప్రభావవంతంగా పనిచేస్తోంది. టమాటాలలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్ ప్రొఫైల్.. కణాలను దెబ్బతినకుండా సంరక్షిస్తుంది. క్యాన్సర్ కణాల ప్రారంభాన్ని, ఎదుగుదలను అడ్డుకుంటుంది. కాబట్టి ఆహారంలో టమాటాలను చేర్చుకోవడం ద్వారా కొన్ని నిర్దిష్ట రకాల క్యాన్సర్‌ల ముప్పు నుంచి రక్షణ కల్పిస్తుంది. 

చర్మానికి చక్కటి సంరక్షణ
టమాటాలలో పుష్కలంగా ఉంటే విటమిన్ ఏ, సీ కలయిక చర్మానికి మేలు చేస్తాయి. ఈ విటమిన్లు లైకోపీన్‌తో కలిసి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. చర్మం సాగే గుణం, తేజస్సుని మెరుగుపరుస్తుంటాయి. అందుకే టమాటాలను సహజ చర్మ సంరక్షణ మిత్రుడిగా చెబుతుంటారు. పర్యావరణ నష్టం నుంచి చర్మాన్ని సంరక్షణలో టమాటాలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి.

దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుదల
టమాటాలను ఆహారంలో భాగంగా తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. టమాటాలలో లక్షణాలు దీర్ఘాయువుకు ఉపయోగపడతాయి. టమాటాలలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ ‘లైకోపీన్‌’ వ్యక్తులలో ‘ఆక్సీకరణ ఒత్తిడి’ని ఎదుర్కోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ‘ఫ్రీ రాడికల్స్‌’ను న్యూట్రల్ చేయడం ద్వారా కణాల ఆరోగ్యానికి మంచి ఆరోగ్య ప్రయోజనకారిగా టమాటా దోహదపడుతుంది.

Related posts

చన్నీటి స్నానంతో ఇంతటి ప్రమాదం ఉందని తెలుసా?

Ram Narayana

బీపీ నియంత్రణకు డబ్ల్యూహెచ్ వో సూచనలివే..!

Ram Narayana

ఫ్రాన్స్‌ను వణికిస్తున్న ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్

Ram Narayana

Leave a Comment