కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విప్లవాత్మకమైన సంస్కరణలు …రాహుల్ గాంధీ
90 శాతంగా ఉన్న బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చర్యలు …
ప్రతిమహిళకు లక్ష రూపాయలు …
నిరుద్యోగ యువతకు ఒక సంవత్సరం ట్రైనింగ్ తో లక్ష రూపాయల వేతనం
రైతులకు కనీస మద్దతు ధర…కూలీలకు రూ 400 కనీస వేతనం …
కులగణన ద్వారా దేశాన్ని ఎక్సరే తీయబోతున్నాం
దాని ద్వారా సంపద అన్ని వర్గాలకు పంచుతామని హామీ ఇచ్చారు …
ఎలక్టోరల్ బాండ్ పెద్ద స్కాం ….
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విప్లవాత్మకమైన సంస్కరణలు తెస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు …శనివారం హైద్రాబాద్ శివార్లలోని తుక్కుగూడ జరిగిన కాంగ్రెస్ జనజాతరసభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు …మహిళలు , యువకులు , రైతులు, కార్మికులు , వ్యవసాయకూలీలు , ఇతర పేదవర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో తయారు చేయబడిందని రాహుల్ స్పష్టం చేశారు … ఈసందర్భంగా
న్యాయపత్రం , ఐదు గ్యారంటీలు విడుదల చేశారు …
తాను కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయడానికి వచ్చన్న రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ , రాష్ట్రంలో గతంలో పాలించిన బీఆర్ యస్ సర్కార్ పై విమర్శలు ఎక్కు పెట్టారు …నాకు గుర్తుంది కొన్ని నెలల క్రితం తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలను ఇక్కడే ఆవిష్కరించాము …అదే వరవడితో ఇక్కడ దేశంలో ప్రజలకు ఇచ్చే గ్యారంటీలను ప్రకటించాలని ఇక్కడకు రావడం జరిగిందన్నారు.. …తెలంగాణాలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ …భారత్ దేశంలో నిరుద్యోగసమస్య చాల ఉంది …ఇప్పటికే తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కొద్దీ రోజులకే 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ …మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతుందని తెలియజేయటానికి సంతోషిస్తున్నాన్నారు రాహుల్ గాంధీ …
దేశంలోని నిరుద్యోగులకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగాలు ఇప్పించబోతున్నాం … అందుకు ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇప్పిస్తాం … యువకుల కోసం అనేక హామీలు ఇస్తున్నాం ..ఉద్యోగాలు చేసే మహిళలు రెండు ఉద్యోగాలు చేస్తారు …మహిళకు చాల కష్టపడతారు …మోడీ సర్కార్ వచ్చినా తర్వాత అనేక మంది పేదలు నిరుపేదలు అయ్యారు … వారి కోసం నారి న్యాయ్ తీసుకోని రాబోతున్నాం …ప్రతి కుటుంబంలో మహిళలకు లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాం…ఇది ఒక విప్లవాళ్వత్మకమైన చర్యగా మారబోతుందన్నారు ..
దేశంలో ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు …మోడీ సర్కార్ ఉన్నతవర్గాలకు అండగా ఉంటూ రైతులకు అన్యాయం చేస్తుంది …రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత ఇవ్వబోతున్నాం …శ్రామిక న్యాయ్ …కార్మికులకు కనీస వేతన చట్టం …రోజుకు 400 రూపాలు కనీస వేతనం ….భారత దేశంలో 50 శాతం వెనకబడిన వాళ్ళు …15 శాతం ముస్లింలు ….15 దళితులు , మరో 8 శాతం గిరిజనలు , 5 శాతం ఇతర పేదలు ఉన్నారు ..మొత్తం 90 శాతం జనాభాకు కేంద్రం చేస్తున్న ఖర్చు చాల తక్కువ …. పేదల సంపద పెద్దవాళ్ళకు పెడుతున్నారు …చివరికి మీడియా కంపెనీల యజమానుల్లో ఎవరు వెనకబడిన వర్గాలు ఎవరు కనపడరు …ఒక్క దళితుడు , ఆదివాసీ లేరు …కేంద్ర ప్రభుత్వాన్ని 90 మంది ఐఏఎస్ అధికారులు నడిపిస్తారు … అందులో కేవలం ముగ్గురు మాత్రమే వెనకబడిన వారు …గిరిజనులు 8 శాతం ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే ఉన్నారు… దళితులు 15 శాతం ఉంటె వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు …
దేశంలో 90 శాతం ఉన్న వెనకబడిన , దళితులు , ఆదివాసీలకు , ముస్లింలు అధికారంలో భాగస్వామ్యం ఎంత …? అందుకోసమే కులగణన జరపబోతున్నాం ..దేశానికి ఎక్సరే తీసి నిజాలు బయట పెడతాం ….అన్ని వర్గాలు వివరాలు తేల్చబోతున్నాం …దీని తర్వాత ఆర్ధిక పరమైన సర్వే జరపబోతున్నాం ….దేశంలో ధనం ఎవరు దగ్గర ఉందొ తేల్చుకుంటాం …ప్రజలకు వారి దామాషా ప్రకారం హక్కుల ఇవ్వబోతున్నాం ….అని రాహుల్ ప్రకటించారు .
తెలంగాణాలో గత ముఖమంత్రి పరిపాలన ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారో చూశామని రాహుల్ అన్నారు …వేలాది మంది ఫోన్ ట్యాప్ లు చేశారు … అధికారం పోయిన తర్వాత వారి దగ్గర ఉన్న వివరాలు ధ్వసం చేశారు …ట్యాపింగ్ ద్వారా కొందరిని భయపెట్టి , వసూల్ చేశారు …ఇది అంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగింది …కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వ్యవరాన్ని బయట పెడుతుంది .. ఇదే విధంగా ఢిల్లీ లో ఉన్న కేంద్ర సర్కార్ చేస్తుంది ….దేశంలో అత్యంత అవినీతి పరులు మోడీ పక్కన ఉన్నారు …ప్రపంచంలో పెద్ద స్కాం ఎలక్ట్రోల్ బాండ్ వసూల్ జరిగిన విషయం వెల్లడైంది …వాళ్లకు బాండ్ లు ఇచ్చిన వారికీ ఏమిటి సంబంధం …సిబిఐ సంస్థ దీనికి తోడ్పడింది ….వేల కోట్లా ప్రాజెక్ట్ లను వాళ్లకు అనుకూలమైన వాళ్లకు ఇచ్చుకుంటున్నారు …కాంగ్రెస్ అకౌంట్ సీజ్ చేశారు …అయినప్పటికీ భయపడం …బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయటానికి ప్రయత్నిస్తుంది ….దాన్ని రద్దు చేయనివ్వం ….ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ….మోడీ 3 శాతం ఉన్న పెద్దల కోసం పనిచేస్తున్నారు ….వ్యవస్థలను దుర్నియాగం చేస్తున్నారు …తమకు వ్యతిరేకంగా ఉంటె జైళ్లకు పంపుతున్నారని బీజేపీ విధానాలపై రాహుల్ ధ్వజమెత్తారు …మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం …చేపల పట్టేవాళ్లకు డీజిల్ సబ్సిడీ ఇవ్వబోతున్నాం …
యువకులకు , మహిళలకు , రైతులకు , కూలీలకు , కార్మికులకు …ఇది విప్లవాత్మక ఎన్నికల ప్రణాళిక ….ఇది ప్రజల మ్యానిఫెస్టో …భారత్ దేశ ముఖ చిత్రం ఈ మ్యానిఫెస్టోలో మారుతుంది …
ఇప్పటివరకు రాజకీయ ఉపన్యాసం ఇచ్చాను …కానీ మనది కుటుంబ బంధం ….మీకు తెలుసు సోనియా గాంధీ మీ వెంట ఉన్నారు … తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను …నాజీవితం మొత్తం సేవ చేస్తాను …తెలంగాణలో చిన్న పిల్లవాడు పిలిచినా మీ ముందు ఉంటా ….తెలంగాణ కొత్త రాష్ట్రం… 29 రాష్ట్రం …ఇది దేశానికి ఆదర్శంగా ఉండాలి …మెడ్ ఇన్ తెలంగాణ కావాలి …తెలంగాణ లో ప్రేమించే బజారు తెరిచారు …ఇది సంతోషించదగ్గ విషయం అని రాహుల్ తన ఉపన్యాసాన్ని ముగించారు …సభలో సీఎం రేవంత్ రెడ్డి , ఏఐసీసీ కార్యదర్శి కేసి వేణుగోపాల్ , రాష్ట్ర వ్యవరాల ఇంచార్జి దీపదాస్ మున్షి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ,ఎంపీలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఇతర ప్రజలప్రతినిధులు హాజరైయ్యారు …సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు …చివరలో తెలంగాణాలో పోటీచేస్తున్న అభ్యర్థులతో కలిసి రాహుల్ గాంధీ గ్రూప్ ఫోటో దిగారు …