Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం పార్లమెంటుకు మంత్రుల కుటుంబసభ్యులకు నో టికెట్ …తేల్చిచెప్పిన కాంగ్రెస్ అధిష్టానం…

ఖమ్మం పార్లమెంట్ కు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలనే దానిపై ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి…జిల్లాలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు తమ కుటుంబసభ్యులకే టికెట్ ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉండటంతో అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది …ఎవరి కుటుంబసభ్యులను ఎంపిక చేసిన మరొకరికి కోపం వస్తుందనే ఉద్దేశంతో ఖమ్మం లోకసభకు కుటుంబసభ్యులకు నో టికెట్ అనే విషయాన్నీ స్పష్టం చేసినట్లు అంత్యంత విశ్వసనీయ సమాచారం …జిల్లాకు చెందిన మంత్రులనే వేరే పేర్లు సూచించాలని చెప్పినట్లు తెలిసింది …దీంతో మంత్రులు అయోమయంలో పడ్డారు … అతి సులువుగా గెలిచే సీటు అయినందున తమ వారికీ టికెట్ ఇస్తే బాగుంటుందని తమ శక్తిని అంతా ఉపయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందనే అభిప్రాయంతో మదనపడుతున్నారు …ఫలితంగా కీంకర్త్యం అనే ఆలోచనలో మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు …శనివారం జనజాతర సభకు వచ్చిన రాహుల్ గాంధీ బస చేసిన హోటల్ కు జిల్లాకు చెందిన నేతలను పిలిచి టికెట్ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం …అయితే చివర ప్రయత్నంగా వారు రాహుల్ సన్నిహితులవద్ద తమ అభిప్రాయాలను తెలిపి తమ వారికే టికెట్ ఇవ్వాలని కోరారని అందుకు అదిసాధ్యం కాకపోవచ్చునని వేరే పేర్లు ఉంటె సూచించాలని వారికీ నిష్కర్షగానే చెప్పినట్లు తెలుస్తుంది …

గత నెల 31 వ తేదీన ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రినింగ్ కమిటీ సమావేశంలో ఖమ్మం సీటు విషయంపై జరిగిన చర్చల్లో ఇద్దరు పేర్లు వచ్చినప్పటికీ వారిని పక్కన పెట్టారని కొత్తవారికోసం అన్వేషణ ప్రారంభించారని సమాచారం …అయితే ఇప్పటికే కొందరు ఆశావహులు మళ్ళీ తమ ప్రయత్నాలు ప్రారంభించారు …వారిలో వంకాయలపాటి రాజా , జట్టి కుసుమకుమార్, రఘుమారెడ్డి ఉన్నారు …కాంగ్రెస్ లో చాలాకాలంగా పనిచేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాలేరు టికెట్ ఆశించి భంగపడిన రాయల నాగేశ్వరరావు , మువ్వా విజయబాబు , మహమ్మద్ జావీద్ లాంటి వారు కూడా మంత్రుల కుటుంబసబులకు కాకపోతే తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు …మొత్తానికి ఖమ్మం లోకసభకు కాంగ్రెస్ నుంచి ఎవరు అభ్యర్థి అవుతారో అనే విషయం ఫజిల్ గా మారింది ….

Related posts

అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం: జనగామలో అమిత్ షా

Ram Narayana

నెగ్గిన పట్నం పంతం …మంత్రిగా ప్రమాణస్వీకారం …

Ram Narayana

ఇల్లందు ,కొత్తగూడెం ఇంచార్జి ఎంపీ వద్దిరాజు ఆపరేషన్ సక్సెస్ …

Ram Narayana

Leave a Comment