Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ఎస్ కు షాకిచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే

  • సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తెల్లం వెంకట్రావు
  • కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన పొంగులేటి
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖాళీ అయిన కారు

భారత రాష్ట్ర సమితికి మరో షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఒకే ఒక అభ్యర్థి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారారు. ఆదివారం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన తెల్లం వెంకట్రావు.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వెంకట్రావుతోపాటు ఆయన సహచరులు కూడా హస్తం పార్టీలో చేరారు. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్లలో కారు ఖాళీ అయ్యింది.

తెల్లం వెంకట్రావు పార్టీ మారతారని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు కొంతకాలంగా వెంకట్రావు దూరంగా ఉన్నారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో వెంకట్రావు అనధికారికంగా పాల్గొనడం సంచలనంగా మారింది. ఈ సమావేశంతోనే వెంకట్రావు పార్టీ మార్పు కన్ఫామ్ అయింది. మణుగూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోనూ వెంకట్రావు పాల్గొన్నారు.

Related posts

రాకేశ్ రెడ్డీ, మీరు కష్టపడ్డారు… ఫలితాలు ఎప్పుడూ ఆశించినట్లుగా ఉండవు: కేటీఆర్

Ram Narayana

కాంగ్రెస్ ను కర్ణాటక క్షమించదు.. తెలంగాణ విశ్వసించదన్న మంత్రి కేటీఆర్

Ram Narayana

ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించండి …బీజేపీ జాతీయ నాయకులు డాక్టర్ పొంగులేటి

Ram Narayana

Leave a Comment