Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ప్రచారంలో దుమ్ము రేపుతున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు…

ఖమ్మం లోకసభ నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రచారంలో దుమ్ము రేపుతున్నారు …మొదటి నుంచి ఒక పద్దతి ప్రకారం వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీకి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరగటం గమనార్హం …. మంగళవారం వైరాలో నిర్వహించిన బైక్ ర్యాలీ లో బీజేపీ, టీడీపీ, జనసేన, ఎం ఆర్ పీ ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. మోడీ, తాండ్ర అనుకూల నినాదాలతో వైరా హోరెత్తింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బస్తర్ మహారాజు, కాకతీయ వంశ వారసుడు మహారాజా కమలచంద్ర భంజ్ దేవ్ కాకతీయ హాజరై తన ఆత్మీయ మిత్రుడు వినోద్ రావు గెలుపు ఖమ్మం అభివృద్ధికి అత్యంత అవసరమని అన్నారు. విద్యావంతుడు, నిజాయితీపరుడు, సేవాభావం మెండుగా ఉన్న వినోద్ గారు అన్ని వర్గాల ప్రజల కోసం ఆలోచించి మేలు చేయగల సమర్థుడని చెప్పారు. ఛత్తీస్గఢ్ లో కూడా కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిందని, ప్రజలు ఆ పార్టీని నమ్మితే కష్టమని అన్నారు. మోడీ మూడో సారి ప్రధాని అయితే, ఆయన సైనికుడిగా వినోద్ రావు ఎన్నో సంక్షేమ పథకాలు, నిధులు తెస్తారని చెప్పారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ మహిళల కోసం మరుగుదొడ్లు అయినా కట్టించలేకపోయిందనీ, మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించడానికి పెద్దపీట వేశారని చెప్పారు. ఎన్నో పార్టీల వల్ల కాని మహిళా రిజర్వేషన్ బిల్లును మోడీ చాలా తేలిగ్గా తీసుకొచ్చారు. ఇంతకుముందు విదేశాలకు వెళ్తే మీ ప్రధానమంత్రి ఎవరు అని ప్రశ్నించేవారనీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ప్రధానమంత్రిగా మోడీ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమయ్యిందని అన్నారు. కరోనా సమయంలో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీల వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధాన మంత్రి మోడీకి దక్కుతుందన్నారు. దేశం కోసం ఆలోచించేది మోడీ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రోజుకో మాట మాట్లాడే మనిషనీ, ఆయన వల్ల ఏ ఉపయోగం ఉండదన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12 వేల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మకపోవడంతో వారిని మాయ చేసేందుకు రిజర్వేషన్ల రద్దు పేరుతో నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని బీజేపి అభ్యర్థి వినోద్ రావు చెప్పారు. రిజర్వేషన్లు రద్దు చేయబోనని మోడీ చెప్పారనీ గుర్తు చేసారు. ఆయుష్మాన్ భారత్ ఆవాస్ యోజన వంటి స్కీములు ప్రధానిగా మోడీ కాగానే మరింత మందికి విస్తృతంగా అందజేస్తారన్నారు. నన్ను దీవిస్తే మోడీని దీవించినట్లేనని వినోద్ రావు అన్నారు
…ప్రధానమంత్రి మోడీ పాలన రామరాజ్యంలో కొనసాగుతోందన్నారు.
పదేళ్లలో ఖమ్మం అభివృద్ధి జరగలేదనీ, మన సమస్యలు మన అభివృద్ధి మనకు తెలుస్తాయి తప్ప పక్క ప్రాంతం వారికి ఇక్కడి సమస్యలు తెలియవన్నారు. పామ్ ఆయిల్ బోర్డు, సింగరేణి మైన్స్ లింకేజ్, రైల్వే లైన్, ఎయిర్ పోర్ట్ కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రధానమంత్రి మోడీతో పాటు ఇంకా అనేకమంది మహానుభావులను ఇక్కడకు తీసుకొచ్చి ఖమ్మం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మరి ఇప్పుడే ప్రజల మధ్యలో లేకపోతే తర్వాత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తాను సామాజిక సేవ చేసుకుంటుంటే మరింత సేవ చేయాలని ఎంపీ టికెట్ ఇచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి పంపించారనీ తెలిపారు.

వైరాలోని శ్రీహరి హరసుత అయ్యప్ప క్షేత్రం లోని శ్రీ సాయిబాబా మందిర 15వ వార్షికోత్సవం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మోడీ మూడోసారి గెలవాలని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి హోమం నిర్వహించగా బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్, ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు హాజరయ్యారు. సాయిబాబా వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారికి బైక్ ర్యాలీ సందర్భంగా గజమాలతో పార్టీ శ్రేణులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి శ్యాం రాథోడ్ మండల అధ్యక్షులు భద్రయ్య, ప్రధాన కార్యదర్శి మనుబోలు వెంకట కృష్ణ, పాపకంటి నరేష్, వెంకీ యాదవ్, శ్రీను, రామారావు, తో పాటు , టిడిపి, జనసేన, ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు

Related posts

పాలేరులో అన్నకోసం తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి విస్తృత పర్యటనలు…!

Ram Narayana

హాట్టహాసంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలకు సిద్ధం

Ram Narayana

పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవు: ఖమ్మంలో కలకలం రేపుతున్న పోస్టర్లు

Drukpadam

Leave a Comment