Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లండన్ పర్యటనకు ఏపీ సీఎం జగన్ దంపతులు..

ఏపీ సీఎం జగన్ శుక్రవారం సాయంత్రం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్ళుతున్నారు . సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ టూర్ వెళ్ళనున్నారు..

ఈ సందర్భంగా యూకే, స్విట్జర్లాండ్‌లో పర్యటించ నున్నారు సీఎం జగన్. ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి వస్తా రని తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజులు ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు. అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరుతూ కౌంటర్ దాఖలు చేసింది.

ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు.. వచ్చే నెల 14కు తీర్పును వాయిదా వేసింది. అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని జగన్‌ను నాంపల్లి కోర్టు ఆదేశించింది.

ఈ నెల 13న పోలింగ్ పూర్తికాగా.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.

Related posts

అమరావతి భూములపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ !

Drukpadam

తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంపు!

Drukpadam

ఏపీ రాజకీయాల్లో కౌన్సిలర్ కూడా బెదిరించేవాడే!: పవన్ కల్యాణ్

Ram Narayana

Leave a Comment