27 న పోలింగ్ …మొత్తం 4 లక్షల 69 వేలమంది ఓటర్లు
ఉమ్మడి ఖమ్మం , నల్లగొండ , వరంగల్ జిల్లాల పరిధిలో విస్తరించిన నియోజకవర్గం
పట్టభద్రులే ఓటర్లు …
2021 లో నల్గొండ , వరంగల్ , ఖమ్మం పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి , 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో నల్లగొండ, వరంగల్, ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్య మైంది. ఉమ్మడి ఖమ్మం నల్లగొండ , వరంగల్ జిల్లాకు వ్యాపించి ఉన్న ఈనియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 69 మంది ఓటర్లుగా నమోదు చేయించుకున్న పట్టభద్రులు ఉన్నారు …ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఈ రోజు25 శనివారం 3.30 గంటలకు ప్రచారం ముగిసింది…ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న సోమవారం జరగ నుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ ఉప ఎన్నికలను రాష్ట్రం లోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీరితో పాటు మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్న ప్రధానపోటీ కాంగ్రెస్ , బీఆర్ యస్ , బీజేపీ అభ్యర్థుల మధ్యనే ఉంటుంది … జనరల్ ఎన్నికలకు తీసిపోని విధంగా పార్టీలు పోటాపోటీ ప్రచారం నిర్వహించాయి…
రెండు రోజులు పాటు మద్యం దుకాణాలు బంద్ :పోలీస్ కమిషనర్
ఈ నెల 27వ తేదిన జరగనున్న వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రెండు రోజులు పాటు మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు (25 వ తేదీ) సాయంత్రం 4:00 గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 4:00 వరకు కమిషనరేట్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని సూచించారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా రెండు రోజుల పాటు డ్రై డేగా ప్రకటించినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు.