Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఎగ్జిట్ పోల్స్ పై తొలిసారిగా స్పందించిన కేసీఆర్…

దేశంలో నిన్న ముగిసిన ఏడో దశ పోలింగ్
విడుదలైన ఎగ్జిట్ పోల్స్ఎ
ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్న కేసీఆర్
ఎక్కువసీట్లు వస్తే పొంగేదిలేదు …తక్కువవస్తే కుంగేది లేదు …
తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ యస్

ఎగ్జిట్ పోల్స్ పై రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి….వాటి విశ్వసనీయతమీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి…దేశమంతా మోడీ ,మోడీ అంటున్నారని 400 సీట్లకు పైగానే తమకు వస్తాయని బీజేపీ అంటుండగా అలాంటిది ఏమిలేదు …ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీల మీద బీజేపీ ప్రభుత్వం వత్తిడి పెట్టి తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయని చెప్పించుకుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించగా , అసలు ఎగ్జిట్ పోల్స్ కు తలాతోకా లేదని,అంతా గోల్ మాల్ గోవిందం లాగా ఉన్నదని బీఆర్ యస్ అధినేత కేసీఆర్ కొట్టి పారేశారు …కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ క్లిన్ స్వీప్ చేస్తున్నట్లు చెప్పారని వాస్తవానికి బీజేపీకి అంట సీన్ లేదని విపక్షాలు విరుచుక పడుతున్నాయి..రాహుల్ గాంధీ సైతం అవి ఎగ్జిట్ పోల్స్ కావు మోడీ మీడియా పోల్స్ అని విమర్శలు గుప్పించారు

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ నిన్న ముగియగా, సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలపైనా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. 

ఈ ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం అంతా గోల్ మాల్ అని కొట్టిపారేశారు. ఒకడు మనకు 11 సీట్లు వస్తాయన్నాడు, ఇంకొకడు ఇంకో సంఖ్య చెబుతాడు… దీనిపై మళ్లీ కోట్లల్లో బెట్టింగులు… అంటూ వ్యాఖ్యానించారు. 

ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కచ్చితంగా మెరుగైన ఫలితాలే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన బస్సు యాత్రకు విశేషంగా ప్రజాస్పందన వచ్చిందని, దాన్ని బట్టి తమకు మంచి ఫలితాలే రావాలని అన్నారు. 

“ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం… ఎన్ని వచ్చినా బాధ లేదు… 11 సీట్లు వస్తే పొంగిపోయేది లేదు, రెండో మూడో వస్తే కుంగిపోయేది లేదు. ఎది ఎలా ఉన్నా తెలంగాణకు రక్షణ కవచం అంటే అది బీఆర్ఎస్ పార్టీనే. రాజకీయ ఫలితాలు వస్తుంటాయి, పోతుంటాయి… ఈ పార్లమెంటు ఎన్నికలు కూడా అంతే” అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.

Related posts

ఎంపీని పెళ్లాడబోతున్న టీమిండియా క్రికెట‌ర్ రింకూ సింగ్‌?

Ram Narayana

ఇండిగో విమానంలో ‘చాయ్ చాయ్’..!

Ram Narayana

173 ఫోన్లు ధ్వంసం చేశారు.. సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేసిన ఈడీ!

Ram Narayana

Leave a Comment