Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

జమ్మూ కాశ్మీర్ హై కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుని అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులు

జమ్మూ కాశ్మీర్ హై కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుని అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులు
న్యాయవాది నజీర్ అహ్మద్ రోంగా పై ‘పబ్లిక్ సేఫ్టీ యాక్ట్’ కింద కేసు నమోదు
శ్రీనగర్ హైకోర్టులో న్యాయవాది అయిన రోంగా కుమారుడు ఉమైర్ రోంగా ఆన్లైన్లో ఇలా పోస్ట్ చేశాడు, “నా తండ్రి, న్యాయవాది ఎన్.ఏ.రోంగా, తీవ్ర కలత కలిగించే విధంగా ఇప్పుడే అరెస్టు చేయబడ్డారు. తెల్లవారు జామున 1.10 గంటలకు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందం ఒకటి, ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా మా ఇంటికి వచ్చారు. కేవలం ‘ఇది పై నుండి వచ్చిన ఆర్డర్ (అపర్ సె ఆర్డర్ హై)’ అని మాత్రమే మౌఖికంగా చెప్పారు. మేము దిగ్భ్రాంతి మరియు తీవ్రమైన బాధకు లోనయ్యాము. బార్ అసోసియేషన్ సభ్యులను బెదిరించడానికి “పబ్లిక్ సేఫ్టీ యాక్ట్” దుర్వినియోగం చేయబడటానికి ఇది మరొక ఉదాహరణ అని పేర్కొన్నారు.
నిర్బంధానికి గల కారణాలపై కుటుంబానికి ఇంతవరకు సమాచారం ఇవ్వలేదని ఉమైర్ చెప్పారు.
ఆయన్ని జమ్మూలోని జైలులో ఉంచుతారు.
ఒక వ్యక్తిని ఒక సంవత్సరం వరకు విచారణ లేకుండా నిర్బంధించడానికి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది. ఈ చట్టం 1975-77 మధ్య కాలంలో ఏమర్జెన్సీలో ఉపయోగించబడిన MISA (మెయింటనన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కు సమాంతరం.
హైకోర్టు బార్ అసోసియేషన్కు పలుమార్లు అధ్యక్షుడిగా ఉన్న రోంగా, 2020 నుంచి సంఘం వార్షిక ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుకోవడంతో, చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. చివరి ఎన్నికలు 2018లో నిర్వహించబడ్డాయి. సెప్టెంబర్ 2019లో జరగాల్సి ఉంది, కానీ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడం, తదుపరి కర్ఫ్యూ కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు.
2020లో ఎన్నికలను ప్రకటించినప్పుడు, కాశ్మీర్ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొన్న బార్ రాజ్యాంగం, భారత రాజ్యాంగానికి అనుగుణంగా లేదని ప్రభుత్వం పేర్కొంది.
బార్ అసోసియేషన్ ఎన్నికల కమిటీ మళ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసిన కొన్ని రోజుల తర్వాత రోంగా అరెస్ట్ జరిగింది. అయితే జూలై 31లోపు ఎన్నికలు పూర్తి చేయాలని కమిటీకి అప్పగించడంతో ప్రభుత్వం మళ్లీ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకుంది.
దాదాపు 3,000 మంది సభ్యులను కలిగి ఉన్న బార్, దాని రాజ్యాంగం నుండి వివాదాస్పద పేరాను తొలగించింది. అయినా ప్రభుత్వం ‘బార్’ ఎన్నికలను అడ్డుకుంటున్నది.

Related posts

మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత…

Ram Narayana

ప్రధాని మైసూర్ లో బస …పెండింగ్ లో హోటల్ బిల్లు పంచాయతీ

Ram Narayana

తొమ్మిదేళ్లుగా కడుతున్న బ్రిడ్జి… ముచ్చటగా మూడోసారి కూలింది…

Ram Narayana

Leave a Comment