Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బెయిల్ ఒకే కాని బయటకు వచ్చే అవకాశంలేదు…

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో మార్చి 21న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈడీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు సంబంధించిన చట్టబద్ధతను విస్తృత ధర్మాసనం తేలుస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీకి అరెస్ట్‌ చేసే అధికారం, విధానం సహా మూడు ప్రశ్నలను లేవనెత్తారు. విస్తృత ధర్మాసనంలో ఈ కేసు తేలేవరకు మధ్యంతర బెయిల్‌ అమల్లో ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు. దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులోనే జూన్‌ 26న సీబీఐ అరెస్ట్ చేసినందున మధ్యంతర బెయిల్‌ లభించినా కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు.

Related posts

పీపుల్స్ మార్చ్ లో భట్టికి వడదెబ్బ …మంగళవారం సాయంత్రం యాత్రకు బ్రేక్ …

Drukpadam

కల్లుగీత కార్పొరేషన్ కు 5 వేల కోట్లు కేటాయించాలి…కె జి కె యస్ డిమాండ్ !

Drukpadam

ఆస్తి కోసం కుమారుడి పట్టు… ప్రభుత్వానికి రాసిచ్చేసిన తండ్రి!

Drukpadam

Leave a Comment