Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఒంగోలు లో మాజీ ,తాజమద్య మాటల యుద్ధం ….

ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు… నీ సంగతేంటో చూస్తా: బాలినేనికి దామచర్ల జనార్దన్ వార్నింగ్

  • ఒంగోలులో బాలినేని వర్సెస్ దామచర్ల జనార్దన్
  • చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యానించిన బాలినేని
  • ఇలాగే మాట్లాడితే నీ కొవ్వు దించుతానంటూ జనార్దన్ కౌంటర్

ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపొందగా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. తాజాగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎన్నికల తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని తాజాగా ఒంగోలు వచ్చి కార్యకర్తలతో సమావేశమై టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాటల తూటాలు పేల్చారు. 

ఏం… మేం చేతకానివాళ్లం అనుకుంటున్నావా… చెప్పుతో కొడతాం అంటూ నిన్న ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో, బాలినేని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘాటుగా స్పందించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరికే వదలం అంటూ హెచ్చరించారు. 

“జైలుకెళ్లినా రెండ్రోజుల్లో వస్తా, చూస్తా అంటున్నావు… నువ్వేం చూస్తావో మేం కూడా చూస్తాం. నువ్వు (అధికారంలో) ఉన్నప్పుడే పీకలేకపోయావు. ఇప్పుడేం పీకుతావో చూస్తా. కొన్ని మాటలు అనాలంటే సంస్కారం అడ్డొస్తోంది. వయసులో పెద్దవాడివి. ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు నువ్వు… నీ కొవ్వు దించుతాను. 

ఏదో గమ్మున ఉంటున్నాం కదా అని రెచ్చిపోతున్నారా? అధికారం అడ్డంపెట్టుకుని నువ్వు, నీ కొడుకు ఎన్ని అరాచకాలు చేశారు? ఆసుపత్రిలో డబ్బులు వసూలు చేయలేదా? గ్రానైట్ లో డబ్బులు వసూలు చేయలేదా? ఒక్కో బార్లోకి వెళ్లి సీసాకు రూ.10 వసూలు చేయలేదా? వైశ్యులకు చెందిన కమర్షియల్ బిల్డింగ్ లకు డబ్బులు వసూలు చేయలేదా? 

నాకేం తెలియదు, నా కొడుక్కేం తెలియదు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు చేసిన పాపాలకు ప్రజలు బుద్ధి చెప్పారు. సంస్కారంతో మాట్లాడడం తెలుసుకో. వచ్చావా… కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పావా… అంతవరకే! 

ఎన్నికల్లో ఓడిపోయాక కార్యకర్తలకు ధైర్యం చెప్పకుండా ఎందుకు పారిపోయావు? కౌంటింగ్ రోజున మాకు ఇంకా సర్టిఫికెట్ ఇవ్వకముందే నువ్వు 4 గంటలకే వెళ్లి హైదరాబాదులో కూర్చున్నావు… నీలాంటి వాడిపై కార్యకర్తల్లో ఏం విశ్వాసం ఉంటుంది? ఇవాళ వచ్చి కార్యకర్తలకు అండగా ఉంటానని ఎలా చెబుతావు?” అంటూ దామచర్ల జనార్దన్ ధ్వజమెత్తారు.

Related posts

జగన్ అక్రమాలను అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపు …

Ram Narayana

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం

Ram Narayana

మళ్ళీ గెలుపు మాదే సందేహం లేదు …మదనపల్లె సభలో సీఎం జగన్

Ram Narayana

Leave a Comment