Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

జర్నలిస్టుల రైల్వే రాయితీ పునఃరుద్దరణపై రేణుకా చౌదరికి టీయూడబ్ల్యూజే( ఐ జే యు) వినతి!

జర్నలిస్టులకు గతంలో ఉన్న రైల్వే రాయితీ సౌకర్యాన్ని పున:రుద్ధరించాలని టి యు డబ్ల్యూ జే ఐజేయు ఆధ్వర్యంలో గురువారం రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి వినతి పత్రాన్ని అందజేశారు. కోవిడ్ కి ముందు దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల కుటుంబ సభ్యుల కు రైల్వే ఛార్జీలో 50 శాతం రాయితీ ఉండేదని, కోవిడ్ అనంతరం ఆ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసిందని టీ యూ డబ్ల్యూ జే ఐజేయు జిల్లా నాయకులు
రేణుకా చౌదరికి విన్నవించారు. త్వరలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయంపై రాజ్యసభలో మాట్లాడి కేంద్రంపై వత్తిడి తీసుకొచ్చి రైల్వేచార్జిలో జర్నలిస్టు కుటుంబ సభ్యులకి 50 శాతం రాయితీ ని పునరుద్ధరింపజేసేందుకు కేంద్రం పై వత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీనిపై స్పందించిన రేణుకాచౌదరి రాజ్యసభలో ఈవిషయం ప్రస్థాయిస్తానని హామీ ఇచ్చారు …రైల్వే శాఖ మంత్రి తో స్వయంగా మాట్లాడతానని అన్నారు ..జర్నలిస్టల సమస్యల పరిష్కరంలో తన వంతు పాత్ర నిర్వహిస్తానని పేర్కొన్నారు …ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఇస్తుందని అన్నారు …తమ సమస్యలు సానుకూలంగా విని వాటికీ పరిస్కారమార్గాలు చూపుతానని హామీ ఇచ్చిన రేణుకాచౌదరి కి ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ కృతజ్ఞతలు తెలిపింది ..

ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐజేయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్ రావు ,జిల్లా నాయకులు నలజాల వెంకటరావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ ,టియూడబ్ల్యుజే నగర అధ్యక్షులు మైసా పాపరావు, కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, ఏలూరి వేణుగోపాల్,జి. నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

Related posts

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఆదరించండి …ఆధార్ పార్టీ అధ్యక్షులు ఈడా శేషగిరి రావు …

Ram Narayana

బీజేపీలోకి సినీ నటి జయసుధ..?

Ram Narayana

తెలంగాణలో దళితబంధుకు బ్రేకులు..! ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ

Ram Narayana

Leave a Comment