Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

రాయల చంద్రశేఖర్ మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు …పలువురు నివాళులు

రైలు ప్రమాదంలో మృతి చెందిన సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ సీనియర్ నేత రాయల చంద్రశేఖర్ కు మృతికి రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు … మాస్ లైన కార్యాలయంలో ఉంచిన ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు … రాజ్యసభసభ్యురాలు రేణుకాచౌదరి , ఎంపీ రఘురాంరెడ్డి , సిపిఐ ,సిపిఎం ,కాంగ్రెస్ , బీఆర్ యస్ నాయకులు , ప్రజాసంఘాల నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు …

తుమ్మల సంతాపం ….

…..సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ సీనియర్ నేత రాయల చంద్రశేఖర్ అకాల మరణం పట్ల దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల
…..ప్రజా ఉద్యమాల కోసం నిరంతరం పోరాటం చేసిన కమ్యూనిస్ట్ గా రాయల చంద్రశేఖర్ తనదైన ముద్ర వేశారు
….చంద్రశేఖర్ కన్నుమూత పట్ల సంతాపం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల

రాయల చంద్రశేఖర్ మృతికి మంత్రి పొంగులేటి సంతాపం

సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ సీనియర్ నేత రాయల చంద్రశేఖర్ అకాల మరణం పట్ల తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా ఉద్యమాల కోసం నిరంతరం పోరాటం చేసిన కమ్యూనిస్ట్ గా రాయల చంద్రశేఖర్ తనదైన ముద్ర వేశారన్నారు. చంద్రశేఖర్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు.

రేణుకాచౌదరి సంతాపం….

సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నేత, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్ గురువారం హఠాన్మరణం చెందగా..రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు …ఆయన మృతి నిజంగా పేదప్రజల ఉద్యమాలకు తీరని లోటని అన్నారు ..

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సంతాపం …

సీపీఐ (ఎంఎల్) మాన్ లైన్ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు …అనేక ప్రజాఉద్యమాల్లో పాల్గొని జైళ్లకు వెళ్లిన నాయకుడని అన్నారు …ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తూ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు …

రాయల చంద్రశేఖర్ కు ఎంపీ రఘురాం రెడ్డి నివాళి

సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నేత, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్ గురువారం హఠాన్మరణం చెందగా..ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరితో కలిసి నగరంలోని ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి..ఆయన సేవలను స్మరించుకున్నారు. రైతుల పక్షాన, పీడిత ప్రజల పక్షాన పోరాటాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మానుకొండ రాధాకిశోర్, కొప్పుల చంద్రశేఖర్ రావు, దీపక్ చౌదరి, ఎండీ. ముస్తఫా, మిక్కిలినేని నరేందర్, కిషన్ రావు, పుసునూరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

రాయల చంద్రశేఖర్ కు సిపిఐ ఘన నివాళి

సీపీఐ (ఎంఎల్) మాన్ లైన్ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల సిపిఐ జిల్లా సమితి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తదితరులు రాయల చంద్రశేఖర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోటు ప్రసాద్ మాట్లాడుతూ జీవిత కాలం విప్లవోద్యమ విజయం కోసం పనిచేసిన చంద్రశేఖర్ ప్రమాడానికి గురై ఆకస్మికంగా మరణించడం అత్యంత దురదృష్టకరమన్నారు. పేద ప్రజలకు లోటని ఆయన తెలిపారు. వారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, కొండపర్తి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, రావి శివరామకృష్ణ, మేకల శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు అడపా రామకోటయ్య, రైతు సంఘంజిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ తదితరులు ఉన్నారు.

సిపిఎం సంతాపం …

సిపిఐ (ఎం.ఎల్‌.) మాస్‌లైన్‌ కేంద్ర కమిటి సభ్యులు, రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్‌ అకాల మృతికి సిపిఎం జిల్లా కమిటి సంతాపాన్ని, కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఎం.ఎల్‌. పార్టీ ఆఫీసులో ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయల చంద్రేశేఖర్‌ అకాల మరణం ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులకు తీరని లోటని అన్నారు.
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు రాయల చంద్రశేఖర్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాల్లో పోరాటాల్లో కలిసి పనిచేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, పి.సోమయ్య, ఎం.సుబ్బారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రం, కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటి సభ్యులు మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్‌, నవీన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌ తదితరులున్నారు.

రాయల చంద్రశేఖర్ మృతికి మాజీ ఎంపీ నామ విచారం

సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నేత రాయల చంద్రశేఖర్ అకాల మరణం పట్ల మాజీ బిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వర రావు విచారం వ్యక్తం చేశారు.

ప్రజా ఉద్యమాల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేసిన కమ్యూనిస్ట్ గా రాయల చంద్రశేఖర్ చెరగని ముద్ర వేశారన్నారు.

రాయల చంద్రశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేశారు

తమ్మినేని సంతాపం…

సిపిఐ (ఎం.ఎల్‌.) మాస్‌లైన్‌ కేంద్ర కమిటి సభ్యులు, రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్‌ అకాల మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం, కుటుంబానికి సానుభూతిని ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించి పాల్గొన్నారని గుర్తు చేశారు. చివరికంటూ కమ్యూనిస్టుగా వుంటూ 50 ఏండ్ల పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్మించి నాయకత్వం వహించారని గుర్తు చేశారు.

పువ్వాడ సంతాపం…

రైతు సంఘం రాష్ట్రనాయకులు సిపిఐ(ఎంఎల్) మాస్ లీడర్ రాయల చంద్రశేఖర్ మృతి పట్ల సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విప్లవోద్యమానికి అంకితమై ప్రజా ఉద్యమంలో పని చేస్తున్న రాయల చంద్రశేఖర్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన చంద్రశేఖర్ ప్రమాదానికి గురై మరణించడం అత్యంత బాధాకరమని పువ్వాడ తెలిపారు.

ఎమ్మెల్సీ తాతామధు సంతాపం …

జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషిచేసిన రాయల చంద్ర శేఖరన్న లేడనే దుర్వార్త విని దిగ్బ్రాంతి చెందాను.

చంద్రశేఖర్ అన్న అకాల మరణం దురదృష్టకరం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి రాయల చంద్రశేఖర్ అన్న.

పోరాటాల పురిటి గడ్డ పిండిప్రోలు గ్రామము నుండి మరొక త్యాగజీవిని కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయం. బిఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరపున రాయల చంద్రశేఖర్ అన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను.

వారి సతీమణి విమలక్కకు మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Related posts

బీ.అర్.ఎస్ పార్టీకి షాక్..రఘునాథపాలెం సర్పంచ్ పార్టీకి గుడ్ బై…

Ram Narayana

బీ.అర్.ఎస్ పార్టీకి షాక్… డిప్యూటీ మేయర్ ఫాతిమా దంపతులు బీఆర్ యస్ కు బై… కాంగ్రెస్ కు జై ..

Ram Narayana

బీజేపీని ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతు …తమ్మినేని

Ram Narayana

Leave a Comment