Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఆరెస్సెస్‌లో ఉద్యోగులు చేరడంపై ఉన్న నిషేధం ఎత్తివేతపై విమర్శలు ..

దశాబ్దాలుగా ఉన్న నిషేధం ఎత్తివేత.. భలే టైమింగ్ అంటూ కాంగ్రెస్ విసుర్లు

  • గాంధీ హత్య తర్వాత 1948లో ఆరెస్సెస్‌పై నిషేధం
  • ఆ తర్వాత ఎత్తివేత.. తిరిగి 1966లో మరోమారు నిషేధం
  • తాజాగా నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • బ్రూరోక్రసీ ఇప్పుడు నిక్కర్లలోనూ రావొచ్చంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు

ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్‌లో చేరడం, ఆ సంస్థ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం, దానితో సంబంధం ఉన్న ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా ఉన్న నిషేధాన్ని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 1966లో విధించిన ఈ నిషేధాన్ని ఈ నెల 9న ఎత్తివేస్తూ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీవోపీటీ) ఆదేశాలు జారీచేసిందని పేర్కొంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్ ద్వారా తెలిపారు.  

మహాత్మాగాంధీ హత్య తర్వాత ఫిబ్రవరి 1948లో సర్దార్ పటేల్ ఈ నిషేధం విధించారని, అయితే, ఆ తర్వాత మంచిగా మెలుగుతామన్న ఆరెస్సెస్ హామీతో దానిని ఎత్తివేశారని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆరెస్సెస్ ఎప్పుడూ నాగ్‌పూర్‌లో మువ్వన్నెల జెండా ఎగురవేయలేదని విమర్శించారు. అయితే, ఆ తర్వాత 1966లో ఆరెస్సెస్, జమాత్-ఇ-ఇస్లామీలో ప్రభుత్వ ఉద్యోగులు చేరడాన్ని ప్రభుత్వం నిషేధించిందని తెలిపారు. 

తాజాగా, నిషేధాన్ని ఎత్తివేడయంపై రమేశ్ తీవ్రంగా స్పందించారు. నిషేధం ఎత్తివేత సమయాన్ని ఎత్తి చూపారు. 4 జూన్ 2024 తర్వాత స్వీయ అవిభక్త నాన్ బయోలాజికల్ పీఎం, ఆరెస్సెస్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు నిషేధం ఎత్తివేత ద్వారా వాటిని తిరిగి పునరుద్ధరించుకోవాలన్న భావన కనిపిస్తోందన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనూ కొనసాగిన నిషేధాన్ని ఇప్పుడు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్యూరోక్రసీ నిక్కర్లలోనూ రావొచ్చు’ అని రమేశ్ విమర్శించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ స్వాగతించారు. 

Related posts

జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శల దాడి…!కేంద్రంలోను, ఏపీలో ఎన్డీయే సర్కార్ అన్న మోడీ

Ram Narayana

 మనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో ప్రియాంక గాంధీ పేరు

Ram Narayana

విపక్ష నేతలపై కేసులు పెడుతున్న మోడీ , కేసీఆర్ , ఎంఐఎం పై ఎందుకు పెట్టడంలేదు ..

Ram Narayana

Leave a Comment