Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

పారిస్ ఒలింపిక్స్ లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత పురుషుల ఆర్చరీ టీమ్..


భారత పురుషుల ఆర్చరీ జట్టు అదరగొట్టింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో నేరుగా క్వార్టర్-ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించింది. ప్యారిస్‌లోని ఎప్లానేడ్ డెస్ ఇన్వాలిడ్స్‌లో జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో భారత ఆర్చర్లు ఆరంభంలో తడబాటుకు గురైనప్పటికీ… పుంజుకొని చివరకు టాప్-4లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు.

ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌ అదరగొట్టారు. మొత్తం 2013 పాయింట్లు సంపాదించారు. 681 పాయింట్లు సంపాదించిన ధీరజ్ భారత జట్టుని టాప్-4లో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యుత్తమంగా రాణించి వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో నాలుగవ స్థానంలో నిలిచాడు.

కాగా భారత్ జట్టు మూడవ స్థానంలో నిలవడంతో క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో టర్కీ లేదా కొలంబియాతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టు సెమీ ఫైనల్‌ కు చేరుకొని అక్కడ దక్షిణ కొరియా జట్టు ఎదురుకాకుంటే టాప్-2లో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Related posts

పాక్ జర్నలిస్టుకు గట్టి షాకిచ్చిన అమెరికా.. అది భారత్ స్వవిషయమని స్పష్టీకరణ…

Ram Narayana

భారత్ లో పర్యటించే తన పౌరులకు కెనడా హెచ్చరికలు!

Ram Narayana

భారత్ ఎమర్జెన్సీ విమాన సర్వీసుకు మాల్దీవులలో అనుమతి నిరాకరణ.. 14 ఏళ్ల బాలుడు మృతి

Ram Narayana

Leave a Comment