Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

వివేకా హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగించిన సీబీఐ కోర్టు

  • వివేకా హత్య కేసులో కీలక పరిణామం
  • తనను సాక్షిగా పరిగణించాలన్న దస్తగిరి
  • దస్తగిరి పిటిషన్ పై విచారణ చేపట్టిన సీబీఐ న్యాయస్థానం

వివేకా హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. 

అప్రూవర్ గా ఇప్పటికే కోర్టు అనుమతి ఇచ్చిందని, అందుకే తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి తన పిటిషన్ లో పేర్కొన్నాడు. వివేకా హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. సీబీఐ చార్జిషీట్ లోనూ తనను సాక్షిగా పేర్కొన్నారన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. 

దస్తగిరి పిటిషన్ లోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ న్యాయస్థానం… వివేకా హత్య కేసు నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Related posts

చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్

Ram Narayana

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడిపై అనర్హత వేటు వేసిన కర్ణాటక హైకోర్టు

Ram Narayana

 కొనసాగుతున్న ఉత్కంఠ… చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

Ram Narayana

Leave a Comment