Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ సీఎం స్పందన

వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ముప్పు ఉందని వారం రోజుల కిందటే కేరళను హెచ్చరించామని, కానీ తగిన చర్యలు తీసుకోవడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ రాజ్యసభలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై కేరళ సీఎం విజయన్ స్పందించారు.

ఇది నిందలు మోపుకునే సమయం కాదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి (అమిత్ షా) చెప్పిన కొన్ని అంశాలు నిజమేనని, కొన్ని మాత్రం అవాస్తవాలని విజయన్ స్పష్టం చేశారు.

“వయనాడ్ ప్రజలు కొండచరియలు విరిగిపడిన ఘటనతో తీవ్ర విషాదానికి గురై ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వానికి తెరలేపాలని అనుకోవడంలేదు. వాస్తవం ఏంటంటే… వయనాడ్ లో కొండచరియలు విరిగిపడొచ్చన్న అంచనాలు మాత్రం వెలువడ్డాయి.. అయితే ఆ అంచనాలు రెడ్ అలెర్ట్ స్థాయిలో ఉన్నాయని ప్రస్తావించలేదు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రెడ్ అలెర్ట్ సందేశం వచ్చింది. అప్పటికి కొన్ని గంటల ముందే విపత్తు సంభవించింది. ఐఎండీ వెలువరించిన అంచనాలకు మించి వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో మీది తప్పంటే మీది తప్పని వాదనలు చేయలేం” అని సీఎం విజయన్ వ్యాఖ్యానించారు.

Related posts

భయపడే వాడు మోదీ కాదు.. తగ్గేదే లేదు: ప్రధాని

Drukpadam

పాక్ మహిళ హనీట్రాప్‌లో చిక్కిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్

Ram Narayana

సిమ్లా సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం… వీడియో ఇదిగో

Ram Narayana

Leave a Comment