Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సీతారామ లిఫ్ట్ పంప్ హౌస్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల చిరకాల వాంఛగా ఉన్న గోదావరి జలాలను పంటపొలాలకు మళ్లించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పుసుగూడెం వద్ద రెండవ పంపు హౌస్ కు స్విచ్ ఆన్ చేయడం ద్వారా ప్రారంభించారు … ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో జరిగిన విధ్వంసంపై ధ్వజమెత్తారు …వారికీ పంటపొలాలకు నీరు ఇచ్చేదానికన్నా నిదులపైనే జ్యాస ఉందని దుయ్యబట్టారు … 10 సంవత్సరాలు సీఎం గా ,ఐదు సంవత్సరాలు నీటిపారుదల శాఖ కూడా తన వద్దే ఉంచుకున్న కేసీఆర్ , ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావులు అప్పులు చేసి ప్రాజెక్టులను ఎందుకు పూర్తీ చేయాలనీ సీఎం ప్రశ్నించారు … తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్ట్ పనులను పూర్తీ చేసి నీరు అందించడం జరిగిందని అన్నారు .అందుకు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమపై వత్తిడి తెచ్చారని అన్నారు .ప్రధానంగా తుమ్మల సీతారామ ప్రాజెక్ట్ పై పట్టుపట్టారని భట్టి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇందిరా సాగర్ , రాజీవ్ సాగర్ చాల తక్కువ ఖర్చులో పూర్తీ అయ్యే వాటిని వదిలి రీడిజైన్ చేసి 18 వేల కోట్ల కోట్లకు అంచనాలు పెంచారని సీఎం పేర్కొన్నారు …ఇప్పుడు 90 శాతం పూర్తీ మేమే చేశాం అంటున్న హరీష్ రావు కేవలం 7 వేల 500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అంటే వారి అంచనాలు ప్రకారం 35 శాతం నుంచి 40 శాతం పూర్తీ కాలేదని అన్నారు …తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే రేయింబవుళ్లు శ్రమించి మూడు పంపు హౌస్ లు పూర్తీ చేసి నీళ్లు ఇచ్చిన ఘతన తమదే అన్నారు ..

రాష్ట్ర మంత్రివర్గం అంత ఖమ్మంలోని ఉంది …సీఎం రేవంత్

ఖమ్మం జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు …ఇక్కడే రాష్ట్ర మంత్రి వర్గం మొత్తం ఉందని , ఆర్థికశాఖ , ప్రణాళిక , విద్యుత్ , రెవెన్యూ , హోసింగ్ , వ్యవసాయశాఖ మంత్రులు అందరు ఇక్కడ ఉన్నారు అని నవ్వుతు సీఎం అన్నారు … కష్టకాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు పార్టీకి అండగా ఉన్నారని అందువల్ల ఖమ్మంకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు …సీతారామ ప్రాజెక్ట్ పూర్తీ చేయడానికి ఎన్ని నిధులు ఖర్చు అయినా తప్పకుండ పూర్తీ చేస్తామని అన్నారు …రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో 80 శాతం , 60 శాతం 40 శాతం , 20 శాతం పనులు పూర్తీ అయిన ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు …బ్యాలన్స్ వర్కులు వేగవంతంగా పూర్తీ చేస్తాం అని సీఎం హామీ ఇచ్చారు …

యస్ మేము 40 వేల కోట్లు అప్పులు తెచ్చాం …మిత్తి 42 వేల కోట్లు కట్టాం

మేము అప్పులు చేస్తున్నాం అని అంటున్నారు …కానీ మేము అప్పు 40 వేల కోట్లు అప్పులు తెచ్చాం…వారు చేసిన అప్పులకు నెలకు 6 వేల 500 కోట్ల చొప్పున ఇప్పటివరకు 42 వేల కోట్లు చెల్లించామన్నారు …

ఎమ్మెల్యేలు ,ఎంపీలు చేసిన విజ్ఞప్తిలను నెరవేరుస్తాం ….

ఎమ్మెల్యే కూనంనేని , ఆదినారాయణ , కనకయ్య , వెంకట్రావు, ఎంపీలు చేసిన విజ్ఞప్తి తప్పకుండ నెరవేరుస్తామని సీఎం అన్నారు …వారు కోరిన విధంగా ఆప్రాంతాలకు కూడా గోదావరి జలాలను త్వరలో చేరే విధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారని అన్నారు …

నీళ్ల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి …పొంగులేటి వాదులాడుకున్నారు …

పాలేరుకు నీళ్లు ఇచ్చే విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వారి ప్రాంతంలో వత్తిడి వచ్చిందని , మనకు లేకుండా పాలేరు కు నీరు ఎలా ఇచ్చారని అక్కడ రైతులు అడిగారని , దీంతో పొంగులేటి …ఉత్తమ్ కుమార్ వాదులాడుకున్నారని సీఎం తెలిపారు …

ఇదే సందర్భంలో కమలాపురం వద్ద మూడవ పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ,అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ ను జిల్లా ఇంచార్జి మంత్రి కోమటి రెడ్డి వంకటరెడ్డి లు ప్రారంబించారు …

కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, ఎంపీ ఆర్ ,రఘురాంరెడ్డి , కొత్తగూడెం , అశ్వారావుపేట , ఇల్లందు ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు , జారే ఆదినారాయణ , కోరం కనకయ్యలు పాల్గొన్నారు …

Related posts

సంక్షేమ పథకాల అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

వాళ్ల పేర్లు చెప్పాలని కవితపై ఒత్తిడి:ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

Ram Narayana

తెలంగాణలో మద్యం దుకాణాలకు బ్రహ్మాండమైన ఆఫర్.. అప్పుపై లిక్కర్ సరఫరా

Ram Narayana

Leave a Comment