Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

నిమ్మగడ్డను కీలక పదవి …

ఆస్కీ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్

  • అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డీజీగా నిమ్మగడ్డ
  • నిమ్మగడ్డ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి
  • టీటీడీ ఈవోగా కూడా పని చేసిన నిమ్మగడ్డ

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీ గవర్నర్ కు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. టీటీడీ ఈవోగా కూడా ఆయన పని చేశారు. ఆస్కీ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా కొనసాగిన నిమ్మగడ్డ తాజాగా అదే సంస్థ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు.

Related posts

చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు! హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకూ కార్ల ర్యాలీ

Ram Narayana

తెలంగాణలో జనసేనకు తక్కువ ఓట్లు వస్తే ఆ ప్రభావం ఏపీపై ఉంటుంది: రేవంత్ రెడ్డి

Ram Narayana

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతిని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు!

Ram Narayana

Leave a Comment