Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

పదవి తీసేసిన ఫర్వాలేదు …కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన వ్యాఖ్యలు!

సినిమాలు లేకపోతే నా జీవితం లేదు…

  • తనకు సినిమాలే ముఖ్యమన్న సురేశ్ గోపీ
  • సినిమాల్లో నటించేందుకు పర్మిషన్ కావాలని అమిత్ షాను కోరానని వెల్లడి
  • కేంద్ర మంత్రి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని వ్యాఖ్య

సినిమాలు లేకపోతే తన జీవితం లేదని మలయాళ సూపర్ స్టార్, కేంద్ర సహాయమంత్రి సురేశ్ గోపీ అన్నారు. ప్రస్తుతం తాను 20 నుంచి 22 సినిమాలకు కమిట్ అయ్యాయని వెల్లడించారు. 

ఈ సినిమాల్లో నటించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అనుమతి కోరారని చెప్పారు. ఎన్ని సినిమాలు అని అడిగారని, తాను 22 సినిమాలు అని చెప్పానని, దాంతో ఆయన తన లేఖను పక్కనబెట్టేశారని సురేశ్ గోపి వివరించారు. 

అయితే అనుమతి ఇస్తారనే భావిస్తున్నానని తెలిపారు. కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేంద్ర మంత్రిని కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని… ఈ పదవిలో కొనసాగాలని తాను ఇప్పుడు కూడా కోరుకోవడం లేదని చెప్పారు. తన అభిమానులను మెప్పించడమే తనకు ముఖ్యమని అన్నారు. 

ఫిల్మ్ షూటింగ్ సెట్లలో తనతో పాటు ముగ్గురు అధికారులు ఉంటారని… వారికి సెట్స్ లో అన్ని ఏర్పాట్లు ఉంటాయని సురేశ్ గోపీ తెలిపారు.

Related posts

ఆలయ ప్రారంభోత్సవంలా లేదు… మోదీ రాజకీయ వేడుకలా ఉంది: రాహుల్ గాంధీ

Ram Narayana

శరద్ పవార్ నివాసంలో I.N.D.I.A. కూటమి సమన్వయ కమిటీ భేటీ

Ram Narayana

కుల గణన నుంచి దృష్టి మళ్లించడానికే మహిళా బిల్లును తీసుకువచ్చారు: రాహుల్ గాంధీ

Ram Narayana

Leave a Comment