Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ ఖాతాలోకి డీసీసీబీ

  • చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మావిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి
  • నాలుగున్నరేళ్ల క్రితం డీసీసీబీని గెలుచుకున్న బీఆర్ఎస్
  • అనారోగ్యంతో ఇటీవల చైర్మన్ నిజాంపాషా రాజీానామా
  • నేడు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ సొంతమైన డీసీసీబీ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ)కి నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 13 స్థానాలు గెలుచుకుని చైర్మన్ పదవిని చేజిక్కించుకుంది. అనారోగ్య కారణాలతో చైర్మన్ నిజాంపాషా ఇటీవల తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. దీంతో నేడు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. 

ఉదయం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై ముగిసే సమయానికి కాంగ్రెస్ నేత, పాన్‌గల్ సింగిల్ విండో చైర్మన్ మావిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి ఒక్కరి నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఈ నేపథ్యంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. డీసీసీబీలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా 11 మంది ఎన్నికకు హాజరయ్యారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన డైరెక్టర్లలో ఎక్కువ మంది కాంగ్రెస్‌లో చేరారు.

Related posts

తెలంగాణ పీసీసీ ఫీఠంపై పీటముడి ..

Ram Narayana

కేసీ వేణుగోపాల్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ… రెండు స్థానాల్లో పోటీపై చర్చ!

Ram Narayana

50 రోజుల్లోనే రూ.1100 కోట్ల కుంభకోణం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు…

Ram Narayana

Leave a Comment