Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

  • ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసంగం హైలెట్స్
  • ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం
  • మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆకాశవాణి (రేడియో)లో ‘మన్ కీ బాత్’ ప్రసంగం వినిపించారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వివరించారు. 

ఇక, అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళుతోందని అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని వెల్లడించారు. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా అంతరిక్ష దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తొలిసారి అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నామని మోదీ వివరించారు. గతంలో లేని విధంగా ఇప్పుడు స్పేస్ సైన్స్ పట్ల యువత ఆకర్షితమవుతోందని పేర్కొన్నారు. 

రాజకీయాల్లోకి రావాలన్న పిలుపుతో యువత నుంచి స్పందన వచ్చిందని, క్రియాశీల రాజకీయాల వైపు యువత మొగ్గుచూపుతోందని ప్రధాని వెల్లడించారు. ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామని, ఆ పిలుపును అందుకుని ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల వద్ద జెండాలు ఆవిష్కరించారని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది ఒక సామాజిక ఉత్సవంగా మారిందని తెలిపారు. 

నాడు స్వాతంత్ర్య పోరాటంలో అన్ని వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయని, రాజకీయ నేపథ్యం లేకున్నా స్వాతంత్ర్యం కోసం పోరాడారని వెల్లడించారు. ఇప్పుడు వికసిత భారత్ సాకారానికి కూడా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని చాటాలని మోదీ పిలుపునిచ్చారు.

Related posts

ఢిల్లీలో 40కి పైగా స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు.. విద్యార్థులను వెనక్కి పంపిన యాజ‌మాన్యాలు

Ram Narayana

ఆ విషయంలో రాష్ట్రాలన్నీ కలిసి రావాలి: నిర్మలా సీతారామన్

Ram Narayana

అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment