Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పువ్వాడ ఆక్రమణలను తొలగింపుకు హరీష్ రావు పెద్ద మనిషిగా వ్యవహరించాలి ..సీఎం రేవంత్ రెడ్డి ..

ఖమ్మంలో మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్మించిన ఆసుపత్రిలో ఆక్రమణలను తొలగించేందుకు హరీష్ రావు పెద్ద మనిషిగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ..ప్రభుత్వ భూములు ,కాలువ భూములు ఆక్రమించి పువ్వాడ హాస్పటల్ కడితే ఈ పెద్ద మనిషి మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు …అవి అన్ని బయటకు రావాలని అవసరమైతే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ద్వారా ఆక్రమణలు గుర్తిస్తామని సీఎం అన్నారు ..

ఖమ్మంలో వరదకు గురైన ప్రాంతల ప్రజలను స్వయంగా పరామర్శించేందుకు సోమవారం ఖమ్మం వచ్చిన సీఎం రాత్రి మంత్రి పొంగులేటి నివాసంలో బస చేసి మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు …పర్యటనకు ముందు మంత్రి నివాసంలో ఖమ్మం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు …గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా సీఎం వ్యవహరించారు …వరద ప్రాంత ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు …తాను స్వయంగా భాదితులను కలిసి వారి కష్టాలను తెలుసుకునేందుకే వచ్చానని సర్వం కోల్పోయిన వారి ఇళ్లను చేస్తుంటే చాల భాద వేసింది అన్నారు ..అందుకే వారికీ కావాల్సిన ఉప్పు ,పప్పు,బియ్యం ,కూరగాయలు , పలు ,మంచినీరు ,నూనెలు , ఇతర వంట సామాగ్రిని అందించడం , దుస్తులు , దుప్పట్లు ,లాంటివి సమకూర్చడం మొదటి కర్తవ్యం అన్నారు …గత సీఎం లలాగా కాకుండా భాదితులకు ఇస్తామన్న ఇంటికి 10 వేల రూపాయలు తక్షణం అందించేందుకే వరదల వల్ల దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లకు 5 కోట్ల రూపాయల రిజర్వ్ ఫండ్ పెట్టినట్లు తెలిపారు …అన్ని శాఖల మంత్రులు ఖమ్మంలోని ఉన్నారని ,ఇక్కడ మంత్రులు మకాం వేసి చర్యలు తీసుకోబట్టి ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగామని అన్నారు ..ఖమ్మంలో గత 75 సంవత్సరాల కాలంలో రాని వర్షం 42 సెంటి మీటర్లు కేవలం మున్నేరు పరివాహక ప్రాంతంలోనే కురిసింది అన్నారు ..

హైడ్రా గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ ఇది ఒక మహా యజ్ఞం లాంటిదని జిల్లాలకు విస్తరించే ఆలోచన ఉందని, జిల్లాల నుంచి కూడా డిమాండ్ ఉన్నదని అన్నారు …వరదలకు కారణం అక్రమణలే అని అభిప్రాయపడ్డారు …అయితే మిషన్ కాకతీయ ద్వారా గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చెరువులకు చేసింది ఏమిటని ప్రశ్నించారు …మీడియా కూడా ఇలాంటి విషయాలను రాయాలని సూచించారు …

హైడ్రా నిర్మించిన ఆస్తులను ధ్వంసం చేసే బదులు హైద్రాబాద్ మహానగరం చుట్టూ ఐదు ,ఆరు కొత్త చెరువులు నిర్మించి వరదలను అటు డైవర్ట్ చేయవచ్చు కదా అని ప్రశ్నించగా ,గతంలో నిర్మించిన చెరువులు గొలుసు కట్టు చెరువులని వరద అటు వైపే ప్రవహిస్తుందని సీఎం వివరించారు …వరద సహాయ నిధుల కోసం ప్రధానిని కలుస్తానని సీఎం అన్నారు …చిట్ చాట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,కోమటి రెడ్డి వెంకటరెడ్డి ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు …

Related posts

బిగించిన పిడికిలి నా తెలంగాణ: రేవంత్ రెడ్డి…

Ram Narayana

సండ్ర గెలుపు కోసం సత్తుపల్లిలో గులాబీ కవాతు …

Ram Narayana

తెలంగాణ భవన్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం ?

Ram Narayana

Leave a Comment