ఖమ్మం వార్తలు

మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు

మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు…!

  • మున్నేరు పరివాహక ప్రజలు బీ అలర్ట్..
  • అధికారులూ అప్రమత్తంగా ఉండండి
  • రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష
  • వరుణుడు మరోమారు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతవాసులు అందరూ ముందస్తు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం నుంచి మళ్ళీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మున్నేరు తో పాటు ఇతర ప్రాంతాల ముంపు బాధితులను పరిస్థితిని అంచనా వేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఆయా నియోజకవర్గ, మండలాల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. ఆహార పానీయాలకు కూడా ఏటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. రోడ్ల పై వాహనాల రాక పోకల పైనా శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

Related posts

ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో SBI మొబైల్ ATM బ్యాంకింగ్ సేవలు..

Ram Narayana

రాయల చంద్రశేఖర్ మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు …పలువురు నివాళులు

Ram Narayana

మధుకాన్ షుగర్స్ లో ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ నిర్వహణ

Ram Narayana