Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జైజై లు పలుకుతున్నజర్నలిస్ట్ సమాజం!

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని వారి మనసు గెలుచుకున్నారు. వారి ఆత్మీయ బంధువయ్యారు . దీంతో మొత్తం జర్నలిస్ట్ సమాజం నుంచి జై జైలు అందుకున్నారు ..ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారత్ దేశంలోని జర్నలిస్ట్ సమాజం ఆరా తీస్తుంది …దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని జర్నలిస్టులు తెలంగాణ ముఖ్యమంత్రి చర్యలను స్వాగతించి,అభినందిస్తున్నారు … గత 18 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఇళ్ల స్థలాల సమస్యలను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన ఎనిమిది నెలల కాలం లో పూర్తి చేయటం గొప్పగా చెప్పుకుంటున్నారు. వాస్తవంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య ఇప్పటిది కాదు రెండు దశాబ్దాలకు పైగా ఇది నలుగుతుంది . 2008 లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు 72 ఎకరాల ఇళ్లస్థలం కేటాయించింది . దీనిపై ఒక ఎన్ జి ఓ సంస్థ కోర్టులో కేసు వేసింది … దీనిపై ఆయన రెవెన్యూ అధికారులతో కేసు వేసినవారి గురించి చివరిసారిగా హెలికాఫ్టర్ ప్రయాణం చేసే రోజునే వాకబు చేశారు .కేసు సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది .చివరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎన్ వి రమణ జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు … అయిప్పటికీ అప్పటి ప్రభుత్వం సొసైటీకి స్థలం ఇచ్చేందుకు ముందుకు రాలేదు .. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 72 మంది చనిపోయారు. మిగతావారు చాలా కాలంగా ప్రభుత్వాల దగ్గర మొరపెట్టుకున్నారు . తెలంగాణ స్వరాష్ట్ర కల నెరవేరింది తప్ప జర్నలిస్టుల కల నెరవేరలేదు .. ఇంటిస్థలం కోసం ఆశలు పెట్టుకున్న అనేక మంది జర్నలిస్టులు ఆశలు వదులుకున్నారు …మరికొందరు పట్టువదలని విక్రమార్కుల్లా తిరిగారు .. రేవంత్ రెడ్డి రూపంలో కనికరం లభించింది …

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ముమ్మరంగా సాగింది ఆ కాలంలో జర్నలిస్టులను జర్నలిస్టు సమస్యలను పెద్దగా పట్టించుకోలేదు చివరకు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి జర్నలిస్టులంతా కలిసి పోగుచేసిన కోటి రూపాయలు తమ అకౌంట్ లో వేసుకున్నారు తప్ప జర్నలిస్టులకు మేలు చేసింది లేదు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది .

టీఆర్ యస్ అధికారంలోకి వచ్చింది . మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికి ఆఫీస్ లో ఉండే బాయ్ తోసహా అందరికి ,ఇళ్లస్థలాలు , అక్రిడేషన్లు , హెల్త్ కార్డులు , ఇస్తానని 2014 ఎన్నికల ప్రణాళికలో లిఖితపూర్వక వాగ్దానం చేశారు . జిల్లా పర్యటనల్లో దేశం అబ్బురపోయేలా అందమైన కాలనీలు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ వాటి నిలుపుకోలేదు. హైదరాబాదులో జవహర్లాల్ నెహ్రు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూమిని కోర్ట్ లో కేసు ఉందని అప్పగించలేదు .. దీంతో నాటినుండి దానిపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యమంత్రుల వద్ద, రెవెన్యూ మంత్రుల వద్ద జర్నలిస్టు లు పలుమార్లు మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది . ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు . ఈ ప్రభుత్వం పోతే కానీ తమకు ఇళ్ల స్థలాలు రావని జర్నలిస్టులో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. 2023 చివర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ యస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది .. మీడియా అకాడమీ చైర్మన్ సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఆయన ఎప్పుడైతే మీడియా అకాడమీ బాధ్యతలు చేపట్టారో అప్పటినుంచి జర్నలిస్టులో కొత్త ఆశలు చిగురించాయి ఆయన కూడా రెండు దశాబ్దాలుగా పెండింగ్ లోఉన్న జవర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీకి స్థలం కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు ముఖ్యమంత్రి దగ్గర ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు దీర్ఘకాలంగా ఎందుకు పెండింగ్ లో ఉన్నది కారణమేమిటి అని విషయాలను ఆయన క్షుణంగా ముఖ్యమంత్రికి ,రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించారు .వెంటనే స్పందించిన ప్రభుత్వం పక్కన వేసిన ఫైల్ వెతికి తీసింది …రవీంద్రభారతి వేదికగా 1100 మంది జర్నలిస్టుల కల సాకారం చేస్తూ వారికీ అధికారికంగా 32 ఎకరాల ల్యాండ్ సీఎం,రెవెన్యూ మంత్రి చేతులమీదుగా అప్పగించడంతో వారి కళ్ళలో ఆనందం నింపారు …జైయవో సీఎం రేవంత్ రెడ్డి అంటూ రవీంద్రభారతి ఆడిటోరియం జర్నలిస్టులు వారి కుటుంబసభ్యులతో మార్మోగింది ….

Related posts

ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అమలు …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోరుతూ ఆగస్టు 9న చలో హైదరాబాద్….

Ram Narayana

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకు ధర్మశాస్త్రం …డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్.

Ram Narayana

Leave a Comment