సీఎం సహాయ నిధికి రూ.2కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీ
హైదరాబాద్ రేస్ క్లబ్ తరఫున మరో డైరెక్టర్ నరసింహా రెడ్డి తో కలిసి
సీఎంకు చెక్కు
కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
వరద భాదిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల పంపిణి
ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టo వాటిల్లగా..వారిని ఆదుకునేందుకు.. ప్రభుత్వానికి తనవంతుగా చేయూత నిచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి ముందుకొచ్చారు. హైదరాబాద్ రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఎంపీ మరో డైరెక్టర్ నరసింహా రెడ్డి తో వెళ్లి ముఖ్య మoత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. రేస్ క్లబ్ తరఫున రూ.2కోట్ల విరాళ చెక్కును ఇచ్చారు. వరద బాధితుల కోసం పెద్దమొత్తంలో అందజేయడం పట్ల సీఎం హర్షం వ్యక్తo చేసి.. వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వరద బాధితులకు నిత్యావసర కిట్లు అందజేసిన ఎంపీ రఘురాం రెడ్డి
- అందరికీ అండగా ఉంటామని అభయం
ఖమ్మం: ఇటీవల మున్నేరు వరదలతో దెబ్బతిన్న 29వ డివిజన్ లోని సుందరయ్య నగర్ లైన్ ప్రాంతoలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి మంగళవారం రాత్రి పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఇంకా దుప్పట్లు, కొబ్బరి నీళ్ల బాటిళ్ళు అందజేసి.. భోజన సదుపాయం కల్పించారు. ఒక్కసారిగా వరద పోటెత్తి.. తాము తీవ్రంగా నష్టపోయామని స్థానికులు ఆవేదన వ్యక్తo చేశారు. స్పందించిన ఎంపి ఆ ప్రాంతం లో కలియతిరిగి చూశారు. అనంతరం లోక్ సభ సభ్యులు రఘురాo రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూస్తామని, బురద మేటల తొలగిoపు పూర్తి చేయించి, రోడ్ల మరమ్మతులు చేయిస్తామని అన్నారు. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు ఉపేందర్, ఇమామ్ భాయ్, స్ఫూర్తి ఓం రాధా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.