Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళిక రూపొందించండి!

  • కేంద్రం నుంచి నిధులొచ్చేలా కృషి చేస్తా
  • కలెక్టర్ తో భేటీలో ఖమ్మం ఎంపీ రామసహాయo రఘురాం రెడ్డి
  • హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫున విరాళ చెక్కు అందజేత
  • కొత్త రైల్వే లైన్ల మ్యాప్ పరిశీలన.. పలు అంశాలపై సూచనలు

ఖమ్మం: ఇటీవల పాలేరు, ఆకేరు, మున్నేరు వరదల ప్రభావానికి గురైన లోతట్టు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేoద్దుకు ప్రణాళిక రూపొందించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ తో భేటీ అయి సుదీర్ఘoగా చర్చించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతపూర్) వైస్ చైర్మన్ కూడా అయిన ఎంపీ.. ఆ ప్రఖ్యాత పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది వేతన విరాళ చెక్కును కలెక్టర్ కు అందజేశారు. ఈ సoదర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతూ..వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణకు అంచనాల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇళ్లతో పాటు రైతుల వ్యవసాయ భూములకు కూడా నష్టo వాటిల్లిందని.. దీనిపై గణాoకాలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వo ఇప్పటికే బాధితులకు పలు రకాలుగా అండగా నిలిచిందని, తాను కేంద్రo నుంచి కూడా నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు
కేంద్రియ విద్యాలయం, పాఠశాలల గురించి ఆరా..
తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్రియ విద్యాలయం, ఏకలవ్య పాఠశాలల్లో పరిస్థి తి పై ఖమ్మం ఎంపీ రఘురాo రెడ్డి ఆరా తీశారు. ఇటీవల వరదల ప్రభావం ఏమైనా పడిందా..? అంటూ వివరాలు తెలుసుకున్నారు. ఈ విద్యాలయాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిద్దామన్నారు. అలాగే..కొత్త రైల్వ్ లైన్ కు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Related posts

అనంతపురం జిల్లాలో 16 టన్నుల బంగారు నిక్షేపాలు..

Drukpadam

మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నారు.. 75 ఏళ్లుగా ఇదే తంతు: పాకిస్థాన్ ప్రధాని ఆవేదన

Drukpadam

ఖమ్మంలో ఈడీ, ఐటీ దాడుల కలకలం …పరేషాన్ లో ప్రవేట్ ఆసుపత్రులు!

Drukpadam

Leave a Comment