Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఫ్యూచర్ సిటీలో జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు

హిందీ పాత్రికేయులకూ సమాన ప్రాతినిథ్యం కల్పిస్తామని, భాషా ప్రాతిపాదికన వివక్ష ఉండబోదని తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ హిందీ దినోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణలో కొత్తతరం పిల్లలు అందరూ హిందీ మాట్లాడుతారని అన్నారు. తెలంగాణ హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎన్.ఎస్. కుమార్ మాట్లాడుతూ జాతీయ భాష అయిన హిందీకి చెందిన జర్నలిస్టులకు కూడా ఇతర భాషా జర్నలిస్టులతో సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అందుకు శ్రీనివాస్ రెడ్డి పూర్తి హామీ ఇస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం పాత్రికేయులను భాషా ప్రాతిపాదికన చూడదని, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరిగితే సరిదిద్దడానికి తానే ముందుంటానని నొక్కి చెప్పారు. పాత్రికేయులకు ఇండ్ల స్ధలాల కేటాయింపుతో పాటు అక్రిడిటేషన్ల మంజూరీ , మెడికల్ ఇన్సూరెన్స లాంటి అన్ని ప్రభుత్వ పథకాలు కూడా అర్హులైన హిందీ జర్నలిస్టులందరికీ అందేట్లు చూసే బాధ్యత తనదే నన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో కూడా హైదరాబాద్ లో పాత్రికేయులకు ఇండ్ల స్థలాలను కేటాయించిందని, అప్పటి సీఎం
వైఎస్ఆర్ కేటాయించిన 70 ఎకరాల భూమిలో కోర్టు వివాదాలతో మిగిలిపోయిన 38 ఎకరాలు 18 ఏండ్ల తరువాత ప్రస్థుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే జెఎన్జేహౌసింగ్ సొసైటీకి స్వాధీన చేయాలంటూ మెమో జారీ చేశారన్నారు. త్వరలో మరో 3 వేల మందికి పైగా హైదరాబాద్ జర్నలిస్టులకు కూడా ఫ్యూచర్ సిటీలలో ఇండ్లస్థలాలు ఇస్థామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు. అయితే దానికి కావలసిన నియమ, నిబంధనలు తదితర మార్గదర్శకాలు రూపకల్పన దశలో ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికి, బాషా భేధం లేకుండా నివాస స్థలాలు లభిస్థాయని ఆయన హామీ ఇచ్చారు.
హిందీ కవులు, పాత్రికేయులను, ఉపాధ్యాయులను హిందీ దినోత్సవం నాడు సన్మానించడం సంతోషదాయకమని మాజీ కేంద్ర మంత్రి ఎస్. వేణుగోపాలా చారి అన్నారు. హిందీ భాష వస్తే దేశంలో ఎక్కడైనా తిరిగి రావచ్చని అన్నారు. అలాగే తెలంగాణలో నివసించే తెలుగువారికీ హిందీ భాష నిత్యజీవతంలో భాగమైందని అన్నారు. ఆటో రిక్షా దగ్గరినుంచి తెలుగువారు కూడా హిందీలోనే మాట్లాడతారని అన్నారు.
టీయూడబ్లుయుజే అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ భారతీయ భాషల్లో హిందీకి ఉన్న ప్రాముఖ్యాన్ని వివరిస్తూ, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఇతర భాషా జర్నలిస్టులకు మాదిరిగానే హిందీ భాషా జర్నలిస్టులకూ వృత్తి మెళకువలకు సంబంధించిన వర్క్ షాప్ లు నిర్వహించాలని కోరారు.
ఈ సంధర్భంగా దక్షిణ్ సమాచార్ పత్రిక ఎడిటర్ నీరజ్ కుమార్ ని హిందీ మిలాప్ ఎడిటర్ స్వర్గీయ వినయ్ వీర్ స్మారక పురస్కారంతో పాటు 21 వేల నగదు ప్రదానం చేసి శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. అలాగే స్వర్గీయ హిందీ పాత్రికేయులు సదాశివ శర్మ స్మారక పురస్కారం ప్రముఖ హిందీ పుస్తకాల పబ్లిషర్ శృతికాంత్ భారతిని, స్వర్గీయ విద్యారణ్య స్మారక పురస్కారం ప్రముఖ పాత్రికేయడు రాకా సుధాకర్ లకు ప్రదానం చేసి సత్కరించారు.
ఈ సంధర్భంగా పాత్రికేయులకు ఇండ్ల స్ధలాలకోసం పోరాడి సాధించినందుకు తెలంగాణ హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తరపున జెఎన్ జే హౌసింగ్ సొసైటీ డైరెక్టర్లు వంశీ శ్రీనివాస్, పివీ రమణా రావు, ఎ.అశోక్ రెడ్డిలను కూడా ఘనంగా సత్కరించడం జరిగింది..
కార్యక్రమంలో అగ్రవాల్ సహయతా ట్రస్ట్,ఆత్మ గౌరవ భవన్ అధ్యక్షుడు రాజేషకుమార్ అగ్రవాల్, గుజరాతీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జిగ్నేష్ దోషీ, ప్రముఖ పారిశ్రమిక వేత్త ప్రదీప్ సురాణా, మహేష్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ లక్ష్మీనారయణ రాఠీ, మౌఢ్ సమాజ్ అధ్యక్ష్ జగదీశ ప్రసాద్ మాయఛ్, ప్రముఖ కధా వాచక్ పవన్ గురు, ప్రముఖ జ్యోతిష్యుడు, సరస్వతీ ఉపాసకుడు దైవజ్ఞ శర్మ, సామాజిక కార్యకర్త టి. నరసింగదాస్ లు పాల్గొన్నారు.
డినాగభూషణం, బ్రిజ్ కిషోర్ లాల్, రిద్వీశ్ జాగీర్దార్, కే. రమేష్ కుమార్, ప్రభాకర్ పంచాల్, యశ్వంత్ వర్మ, వికాస్ శుక్లా, జస్రాజ్ జైన్, పరుశ్ రామ్ తివారీ, ప్రవీణ నావందర్, మురళీ యాదవ్, రాజేశ్ కళ్యాణీ, సురభీ దత్త్, డా. రాజీవ్ కుమార్ సింహ్, హిందీ టీచర్లు రశ్మీ రాకూర్, ప్రముఖ హిందీ కవయిత్రి జ్యోతి నారాయణలను ఘనంగా సత్కరించడంతో పాటు ,జాతీయ భాష హిందీ ప్రాముఖ్యత విషయంపై వివిధ పాఠశాలలల్లో నిర్వహించిన వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీల విజేతలైన విద్యార్ధినీ విధ్యార్ధులకు బహుమతుములను ప్రదానం చేయడం జరిగంది. ప్రముఖ హిందీ హస్య కవి నంద్ గోపాల్ భట్టడ్ కార్యక్రమ సంచాలకుడుగావ్యవహరించగా, హిందీ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ఎ. సర్వర్ వందన సమర్పన చేశారు.

Related posts

దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. యశోద ఆసుపత్రికి తరలింపు…

Ram Narayana

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ అరెస్ట్… తీవ్రంగా స్పందించిన కేటీఆర్

Ram Narayana

మాజీ సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడటం విడ్డురం …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

Leave a Comment