- హైదరాబాదులో ఈ నెల 16, 17 తేదీల్లో మహా నిమజ్జనం
- ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు
- చివరి రైలు రాత్రి ఒంటిగంటకు బయల్దేరుతుందన్న మెట్రో రైల్ సంస్థ
హైదరాబాదు నగరం గణేశ్ మహా నిమజ్జనం కోసం సన్నద్ధమవుతోంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఖైరతాబాద్ మహా గణపతి సహా లక్షలాది గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాదులో మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు.
ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ పేర్కొంది. రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయల్దేరుతుందని వెల్లడించింది. అంతేకాకుండా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను కూడా నడుపుతామని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వివరించింది.