Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్

  • లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామాను సమర్పించిన కేజ్రీవాల్
  • నూతన శాసన సభా పక్ష నేతగా అతిశీ ఎంపికైనట్లు వెల్లడి
  • మరో వారం రోజుల్లో సీఎంగా ప్రమాణం చేయనున్న అతిశీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. కాబోయే ముఖ్యమంత్రి అతిశీ, ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నూతన శాసన సభా పక్ష నేతగా అతిశీ ఎంపికైనట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో ఢిల్లీ నూతన సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఢిల్లీ ప్రయోజనాల దృష్ట్యా జైల్లో ఉన్నప్పుడు రాజీనామా చేయవద్దని కేజ్రీవాల్ భావించారని, అందుకే ఆయన బయటకు వచ్చాక రాజీనామా చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఢిల్లీ ప్రజల ముందు తన నిజాయతీని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. కేజ్రీవాల్ ప్రజాకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నారు. ప్రజలు అతనిని మరోసారి సీఎంగా ఎన్నుకునే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగబోరన్నారు.

ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ

Atishi Marlena to be new Delhi CM

రెండు రోజులుగా నెల‌కొన్న సందిగ్ధానికి తెర‌ప‌డింది. ఢిల్లీ సీఎం ఎవ‌రో తేలిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి అతిశీ త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ఆప్ మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఆమెను ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భ‌ప‌క్ష నేత‌గా ఎన్నుకున్నారు. అతిశీ పేరును కేజ్రీవాల్ ప్ర‌తిపాదించారు. ఢిల్లీ మంత్రివ‌ర్గంలో ఏకైక మ‌హిళా మంత్రి అతిశీనే కావ‌డం గ‌మ‌నార్హం. కేజ్రీవాల్ జైల్లో ఉన్న‌ప్పుడు ఆమె కీల‌కంగా వ్య‌వహ‌రించారు. సాయంత్రం త‌న సీఎం ప‌ద‌వికి కేజ్రీవాల్ రాజీనామా చేయ‌నున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామా లేఖను ఇవ్వ‌నున్నారు.

Related posts

బీజేపీ ఒక టెర్రరిస్టుల పార్టీ: ఖర్గే ఫైర్

Ram Narayana

అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాడాల్సిందే …మోహన్ భగత్ …

Ram Narayana

చావనైనా చస్తాను కానీ… నాకు ఇది కావాలి అంటూ పార్టీ వద్దకు వెళ్లను: శివరాజ్ సింగ్ చౌహాన్

Ram Narayana

Leave a Comment