ఏపీలో జంపింగ్ జిలానీలు …జనసేనలోకి బాలినేని ,సామినేని
ఇప్పటికే టీడీపీలో చేరిన కొందరు నేతలు
అధికారం లేకపోతె బతకలేని పరిస్థితి
ఎండిపోయిన చెరువులా వైసీపీ
ఏపీలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది …అధికారంలో ఉన్నప్పుడు మీఅంత గొప్పవాళ్ళు లేరని పొగిడిన నోరులే నేడు జగన్ వ్యవహార తీరు బాగాలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి..అనేక మంది నేతలు పార్టీని వీడుతున్నారు …పశ్చిమగోదావరి గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మ టీడీపీలో చేరగా ఇంతకు ముందే ఏలూరు కార్పొరైన్ చైర్ పర్సన్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు …కొందరు ఎమ్మెల్సీలు చేరారు ..మరి కొందరు అదుముకోసం చూస్తున్నారు …తాజాగా వైయస్ జగన్ సమీప బంధువు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ విప్ గా పనిచేసిన సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు ..అధికారం ఎక్కడ ఉంటె అక్కడ ఉండాలనే కొందరు నేతలు జంపింగ్ జిలానీలు అవుతున్నారు …వైసీపీలో ఉంటె లాభం లేదని ఎండిపోయిన చెరువులా ఉందని తమ దార్లు తాము చూసుకుంటున్నారు ..
ఈ నెల 22న జనసేనలో చేరుతున్నా: సామినేని ఉదయభాను
- వైసీపీకి గుడ్ బై చెప్పిన సామినేని ఉదయభాను
- నేడు జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే
- వైసీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వెల్లడి
వైసీపీకి గుడ్ బై చెబుతున్న కీలక నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, తాజాగా సామినేని ఉదయభాను… వైసీపీని వీడారు. తాను ఈ నెల 22న (ఆదివారం) జనసేన పార్టీలో చేరుతున్నట్టు సామినేని ఉదయభాను ప్రకటించారు. తనతో పాటు వచ్చే కార్యకర్తలను కూడా జనసేన పార్టీలోకి తీసుకెళతానని పేర్కొన్నారు. సామినేని ఉదయభాను నేడు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వైసీపీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని సామినేని అన్నారు. పార్టీ అధినాయకత్వం తీరు నచ్చకే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. కాగా, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆదివారం నాడే జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు.