Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం: సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్!

  • వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు
  • ఈ పిటిషన్లను వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం
  • అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న కేంద్రం

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే తగినన్ని శిక్షలు ఉన్నాయని, కానీ ఇది మాత్రం చట్టబద్దమైన అంశానికి మించిన సామాజిక సమస్య అని పేర్కొంది. ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వెల్లడించింది.

ఈ అంశంపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భాగస్వామ్య పక్షాలతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉందని తెలిపింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సమస్యపై (వైవాహిక అత్యాచారం) నిర్ణయాన్ని వెల్లడించలేమని కోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని వెల్లడించింది. కేంద్రం, అన్ని రాష్ట్రాలు, ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా దీనిపై ఓ నిర్ణయం తీసుకోలేమని వెల్లడించింది.

Related posts

లండన్‌ పోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య యత్నం అడ్డుకున్నఅధికారులు..

Drukpadam

లాయర్లకు ఉన్న లగ్జరీ మాకెక్కడిది? సిజెఐ చంద్రచూడ్…

Ram Narayana

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా…తెలంగాణలో నవంబర్ 30 ఎన్నికలు ..

Ram Narayana

Leave a Comment