జాతీయ వార్తలు

శబరిమల అయ్యప్ప దర్శనం ఆన్‌లైన్ బుకింగ్‌ ద్వారానే!

కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2024 శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్‌ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్‌ ప్రారంభం కానున్న వేళ ఈ నిర్ణయం వెల్లడించింది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
వర్చువల్‌ క్యూ బుకింగ్‌ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉందని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. తీర్థయాత్రల సన్నాహాలను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మకరవిళక్కు సీజన్‌లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అటవీమార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పార్కింగ్‌ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్లు, దాని చుట్టూ పార్కింగ్‌ నిర్వహణ పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అతిథి గృహ నిర్మాణం పూర్తయిందని త్వరలో మరొకటి పూర్తి కానున్నట్లు వెల్లడించారు.

Related posts

ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీకి షాక్.. మార్నింగ్ వాక్‌లో చైన్ స్నాచింగ్!

Ram Narayana

షికాగోలో సైకిల్ తొక్కిన స్టాలిన్… స్పందించిన రాహుల్ గాంధీ

Ram Narayana

సంచలనంగా మారిన లిక్కర్ స్కాం లో కేజ్రీవాల్ పాత్ర…!

Drukpadam