Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలుప్రమాదాలు ...

తమిళనాడులో గూడ్స్ రైలును ఢీకొట్టిన దర్భంగా ఎక్స్‌ప్రెస్!

  • తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
  • మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధం
  • ఏసీ కోచ్‌లలోని 19 మందికి గాయాలు

తమిళనాడులో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధమయ్యాయి. దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళుతుంది.

ఈ ప్రమాదంలో దర్భంగాలోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదరుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి ఒకటి ఎక్కాయి. విషయం తెలియగానే ఘటనాస్థలికి పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది, స్థానికులు చేరుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ మృతి చెందలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. గూడ్స్ రైలును ఢీకొన్న సమయంలో ముందు ఉన్న కోచ్‌లు అన్నీ ఏసీవే. ఈ కోచ్‌లలోని 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Related posts

హర్యానాలో ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన మహిళ…

Drukpadam

ఆసుపత్రిలో కుప్పకూలిన లిఫ్ట్.. అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మృతి!

Ram Narayana

నా జీవితంలో తొలిసారి ఎంతో భావోద్వేగానికి గురవుతున్నా: మోదీ

Ram Narayana

Leave a Comment