Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

మోటో ఎడ్జ్ 50 ప్రో ధరపై భారీ తగ్గింపు ఆఫర్…

  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్‌లో భాగంగా ఏకంగా రూ.12,000 తగ్గింపు
  • రూ.41,999 ఫోన్‌ను రూ.29,999లకే దక్కించుకునే అవకాశం
  • ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్’ పేరిట పలు ప్రీమియం ఫోన్లపై డిస్కౌంట్లు  

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ ఇటీవలే ముగిసినప్పటికీ.. ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్’ పేరిట కొత్త డిస్కౌంట్ సేల్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఆఫర్ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్, మోటరోలా, యాపిల్ వంటి కంపెనీలకు చెందిన ప్రీమియం మోడల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా మోటరోలా ఫోన్లపై కంపెనీ గణనీయమైన తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది.

కొన్ని నెలల క్రితమే భారత మార్కెట్‌లో విడుదలైన మోటో ఎడ్జ్ 50 ప్రో ఫోన్‌పై ఏకంగా రూ.12 వేల డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.41,999 పలుకుతున్న ఈ ఫోన్‌ను డిస్కౌంట్ మినహాయించి రూ.29,999కే దక్కించుకోవచ్చు. అంటే ఏకంగా 28 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదనంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. పాత ఫోన్ పనితీరు ఆధారంగా దాని విలువ ఆధారపడి ఉంటుంది.

కాగా మోటో ఎడ్జ్ 50 ప్రో ఫోన్ కొన్ని నెలల క్రితమే మార్కెట్‌లో విడుదలైంది.  50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్‌లు ఉన్నాయి. అల్యూమినియం ఫ్రేమ్,  6.7-అంగుళాల డిస్‌ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 200 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌, ఆండ్రాయిడ్ 14, స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో పాటు 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

Related posts

బంగారం ధరలతో కంచి పట్టుచీరల ధరలు పోటీ.. భయపడుతున్న మగువలు!

Ram Narayana

చదరపు గజానికి రూ. 29 లక్షలా?.. అపార్ట్​ మెంట్లు ఇంత రేటా?

Ram Narayana

మీకు ఈ సంగతి తెలుసా… ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డు రూల్స్ మారాయి!

Ram Narayana

Leave a Comment