జాతీయ రాజకీయ వార్తలు

ఝార్ఖండ్ ఝార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా డిప్యూటీ సీఎం భట్టిని నియమించిన ఏఐసీసీ …

సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మహారాష్ట్రలో… ఏఐసీసీ కీలక బాధ్యతలు

  • మహా అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా నియమించిన ఏఐసీసీ
  • ఝార్ఖండ్‌ లో పరిశీలకుడిగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ

తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు ఏఐసీసీ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా వారిని నియమించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది.

మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మందిని నియమించగా… ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. ఇక, ఝార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని పరిశీలకులుగా నియమించారు.

Related posts

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం …ఇండియా కూటమిపై ప్రభావం చూపదన్న కేజ్రీవాల్ ..

Ram Narayana

జీ20 సదస్సులో ప్రధాని ముందు ‘భారత్’ నేమ్ ప్లేట్

Ram Narayana

‘పాలస్తీనా’ బ్యాగ్‌తో ప్రియాంకగాంధీ… బీజేపీ నేతల చురకలు…

Ram Narayana