Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైఎస్​ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు

వైఎస్​ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు – తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్‌

ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు రచ్చకెక్కాయని తెలిసింది. తాజాగా జగన్​మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో వివాదాలే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీలో షేర్ బదిలీలపై ఆయన హైదరాబాద్​లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్​(ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్‌ విజయమ్మ, షర్మిల షేర్లు ఉన్న సరస్వతీ పవర్‌ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని ఏపీ మాజీ సీఎం జగన్‌, ఆయన భార్య భారతి రెడ్డిలు పిటిషన్​లో కోరారు.
ఎన్నికల అఫిడవిట్​లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్​ లిమిటెడ్‌లో ఆయనకు షేర్లు ఉన్నట్లు వైఎస్ జగన్‌ తెలిపారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో జగన్​కు, షర్మిలకు మధ్య వివాదం తలెత్తడంతోనే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్​ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం సరస్వతి కంపెనీలో వైఎస్ విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించినట్లు, కొన్ని కారణాలతో ఆ షేర్ల కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో తెలిపారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్​డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్ దాఖలు చేశారు.

Pతదుపరి విచారణ నవంబర్ 8కి వాయిదా : ఈ పిటిషన్​లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, సరస్వతి పవర్ సౌత్- ఈస్ట్ రీజియన్ జనార్ధన్ రెడ్డి చాగరి, తెలంగాణ కంపెనీల రిజిస్ట్రార్ కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. సెప్టెంబర్ 10న వైఎస్ జగన్ తరఫున వై.సూర్యనారాయణ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్​ను క్లాట్ విచారణకు స్వీకరించగా తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది.

Related posts

దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు… విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు!

Drukpadam

పెద్ద కొడుకు అంత్యక్రియలు చేసొచ్చే లోపు.. చిన్న కుమారుడూ మృతి

Drukpadam

షాకింగ్ విద్యుత్ చార్జీల పెంపునకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!

Drukpadam

Leave a Comment