- జైపూర్‌లో పసిడి, వెండి ధూళితో స్వీట్స్ తయారీ
- ‘స్వర్ణ్ భస్మ్ పాక్’, ‘చాందీ భస్మ్ పాక్’ పేరిట మిఠాయిల విక్రయం
- ఖరీదు కొంచెం ఎక్కువైనా ఎగబడి మరీ కొంటున్న కొనుగోలుదారులు
- ఈ మిఠాయి తింటే రోగనిరోధకశక్తి మెరుగుపడుతుందంటున్న స్వీట్‌షాపు యజమాని
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ మిఠాయి కొట్టువారు వినూత్నంగా స్వీట్స్ తయారు చేస్తూ తాజాగా వార్తల్లో నిలిచారు. ఇక్కడ స్వీట్స్ పసిడి, వెండి ధూళితో తయారు చేస్తున్నారు. ‘స్వర్ణ్ భస్మ్ పాక్’, ‘చాందీ భస్మ్ పాక్’ పేరిట తయారు చేస్తున్న ఈ స్వీట్స్‌కు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఖరీదు కొంచెం ఎక్కువైనా ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారట.
“కిలో స్వీట్స్‌ను రూ. 75వేలకు అమ్ముతున్నాం. ఇది 10 గ్రాముల బంగారం ధరకు సమానం. అలాగే 20 గ్రాముల బరువు కలిగిన ఒక మిఠాయిని రూ. 1550కి విక్రయిస్తున్నాం. డైలీ పసిడి ధరతో మిఠాయి ధర కూడా మారుతుంది.
వెండి, పసిడి ధూళితో తయారైన ఈ స్వీట్ తింటే రోగనిరోధకశక్తి మెరుగుపడటంతో పాటు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు” అని స్వీట్‌షాప్ యజమాని అంజలి జైన్ వెల్లడించారు.