Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

దేశంలో ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి అనువైన సిటీ ఏదంటే..!

  • ఏక్యూఐ 50 లోపు ఉన్న నగరాల్లో ఐజ్వాల్ టాప్
  • దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాలు కాలుష్యరహితం
  • పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ రెండు నగరాల్లో గాలి నాణ్యత భేష్

దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ గా మారిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) దారుణంగా పడిపోయింది. పీల్చే గాలి విషపూరితంగా మారిపోయిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి మన దేశంలో ప్రశాంతంగా గాలి పీల్చుకునే ప్రదేశం ఎక్కడుందని అంటే.. మిజోరాం రాష్ట్రంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో గాలి నాణ్యత బాగుందని అంటున్నారు. ఈ సిటీలో ఏక్యూఐ కేవలం 29 పాయింట్లేనని చెప్పారు. అంటే.. ఐజ్వాల్ ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారని అర్థం. అంతేకాదు ఈ నగరంలో ట్రాఫిక్ చికాకులు, వాహనాల రణగొణ ధ్వనులూ లేవట. శబ్ద, వాయు కాలుష్యానికి దూరంగా ప్రశాంతంగా ఉంటుందని మిజోరాం ప్రభుత్వం చెబుతోంది. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ రెండు నగరాలలో గాలి నాణ్యత చాలా బాగుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.

దేశంలో ఏక్యూఐ 50 లోపున్న నగరాలు ఇవే..
సిటీ, రాష్ట్రం                                    ఏక్యూఐ
ఐజ్వాల్ (మిజోరాం)                            29
నాగావ్ (అసోం)                               38
త్రిస్సూర్ (కేరళ)                                43
బాంగల్ కోటె (కర్ణాటక)                       46
నాహర్ లాగున్ (అరుణాచల్ ప్రదేశ్)         48
గువాహటి (అసోం)                             48
రామనాథపురం (తమిళనాడు)              48
ఛామరాజనగర్  (కర్ణాటక)                     50

Related posts

ఇంటర్నెట్‌ను నిలిపేసే ఒకే ఒక్క ప్రజాస్వామ్య దేశం మనదే.. శశిథరూర్ ఫైర్

Drukpadam

బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడేందుకు కెనడా నుంచి తిరిగొచ్చిన హర్యానా యువతి గల్లంతు…

Drukpadam

ఢిల్లీలో ముగిసిన కేంద్రం అఖిలపక్ష భేటీ…

Ram Narayana

Leave a Comment