Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

వాలంటీర్ వ్యవస్థ లేదనడం దారుణం: బొత్స సత్యనారాయణ…

  • వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదన్న మంత్రి బాల వీరాంజనేయస్వామి
  • వాలంటీర్ల రెన్యువల్ జీవోను కూటమి ప్రభుత్వం ఇవ్వొచ్చు కదా అన్న బొత్స
  • వాలంటీర్లను ప్రభుత్వం మోసం చేసిందన్న రామసుబ్బారెడ్డి

వాలంటీర్ల అంశం ఏపీ శాసనమండలిని కుదిపేసింది. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ… రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని చెప్పారు. 2023 ఆగస్ట్ లో వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసిందని… ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించే జీవో జారీ చేయలేదని చెప్పారు. లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అన్నారు. 

ఈ క్రమంలో వైసీపీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… వాలంటీర్ల వేతనం రూ. 10 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని… ఇప్పుడు ఆ వ్యవస్థే లేదనడం దారుణమని అన్నారు. వాలంటీర్ల రెన్యువల్ జీవోను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇవ్వొచ్చు కదా? అని అన్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ… వాలంటీర్ల విషయంలో వైసీపీ అనుమానాలే నిజమయ్యాయని చెప్పారు. వాలంటీర్లను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తుందని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతోందని వైసీపీ చెపుతూనే వస్తోందని అన్నారు. ఇప్పుడు మంత్రి ఇచ్చిన సమాధానంతో ఆ కుట్ర నిజమేనని తేలిందని చెప్పారు.

వాలంటీర్లే లేరు.. వాళ్లకు జీతాలు ఎలా చెల్లించాలి?: మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి

There are no volunteers in AP says minister Dola Bala Veeranjaneya
  • వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదన్న మంత్రి
  • 2023 ఆగస్ట్ నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని వ్యాఖ్య
  • ఎన్నికలకు ముందు వాలంటీర్లతో రాజీనామాలు చేయించారన్న మంత్రి

ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయిందని అన్నారు. 

ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని బాలవీరాంజనేయస్వామి  తెలిపారు. కానీ, లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే వారిని కొనసాగించేవాళ్లమని చెప్పారు. 2023 ఆగస్ట్ నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వారితో రాజీనామా చేయించారని… ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు లేరని చెప్పారు.  

2023 ఆగస్ట్ వరకు వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని… 2023 సెప్టెంబర్ లో వారిని కొనసాగించే జీవో ఇవ్వలేదని తెలిపారు. వారిని కొనసాగిస్తున్నట్టు జీవో ఇచ్చిఉంటే వారి జీతాలను కూడా పెంచేవాళ్లమని చెప్పారు. అయితే, వాలంటీర్ల వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు  సమాధానమిస్తూ ఆయన ఈమేరకు స్పష్టతనిచ్చారు.

Related posts

నారాయణకు టీడీపీ టికెట్ నేపథ్యంలో.. కేతంరెడ్డి జనసేనకు గుడ్ బై….

Ram Narayana

టీడీపీతో పొత్తు మోదీకి ఇష్టం లేదు.. ఆయన కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నారు: మేకపాటి రాజమోహన్ రెడ్డి

Ram Narayana

ఏపీలో టీడీపీ ,వైసీపీ ఢీ అంటే ఢీ …

Ram Narayana

Leave a Comment