Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

ఈ దేశాల్లో మహిళలే అధికం.. ఆ రెండు దేశాల్లో మహిళల శాతం మరీ దారుణం!

  • ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న స్త్రీల సంఖ్య
  • కొన్ని దేశాల్లో పురుషుల సంఖ్యను మించిపోయిన తీరు
  • మరికొన్ని దేశాల్లో మాత్రం దారుణంగా లింగ నిష్పత్తి

 దేశమేదైనా, ప్రాంతమేదైనా ఆడా, మగా సమానంగా ఉండటం అవసరం. ఎవరి సంఖ్య పెరిగినా, మరొకరికి ఇబ్బందిగా మారుతుంది. స్థానిక సంప్రదాయాలు, ఆచారాలు, వాతావరణం, మూఢ నమ్మకాలు వంటి ఎన్నో కారణాలతో పలు దేశాల్లో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగింది. ఇటీవల పరిస్థితిలో చాలా వరకు మార్పు వచ్చినా… కొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. పది మంది పురుషులకు నలుగురు స్త్రీలు కూడా లేని పరిస్థితి ఉంది. అయితే కొన్ని దేశాల్లో పురుషులతో పోలిస్తే స్త్రీల జనాభా గణనీయంగా ఎక్కువగా ఉండటం గమనార్హం. గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కూడా స్త్రీల సంఖ్య పెరుగుతూ వస్తోంది కూడా. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో ఈ గణాంకాలను వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో స్త్రీల జనాభా శాతం
దేశంస్త్రీల జనాభా శాతం
నేపాల్54.2%
హాంగ్ కాంగ్54.1%
ఉక్రెయిన్53.7%
రష్యా53.7%
పోర్చుగల్52.7%
హంగరీ52.4%
శ్రీలంక52.7%
ఫ్రాన్స్, పోలాండ్51.6%
కజకిస్తాన్51.5%
రొమేనియా51.4%
థాయిలాండ్, ఇటలీ51.3%
అర్జెంటీనా, జపాన్51.2%
ఉత్తర కొరియా, మెక్సికో51.2%
గ్రీస్, కొలంబియా, బ్రెజిల్50.9%
దక్షిణాఫ్రికా, ఆస్ట్రియా, చిలీ50.7%
టర్కీ, యూకే, జర్మనీ50.6%
యూఎస్ఏ50.5%
స్విట్జర్లాండ్, కెనడా50.4%
ఇథియోపియా50%
దక్షిణ కొరియా, స్వీడన్49.9%
అల్జీరియా, ఈజిప్ట్, నార్వే49.5%
బంగ్లాదేశ్49.4%
చైనా, ఆఫ్ఘనిస్థాన్48.7%
పాకిస్థాన్48.5%
భారత్48.0%
సింగపూర్47.7%
సౌదీ అరేబియా42.2%
యూఏఈ30.9%
ఖతార్24.8%

Related posts

వివాహిత అదృశ్యం.. కొండచిలువ కడుపులో మృతదేహం లభ్యం…

Ram Narayana

రోజుకు 26 గంటలు.. కొత్తగా చిత్రమైన ప్రతిపాదన!

Ram Narayana

వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జబర్దస్త్ రోహిణి ఫైర్

Ram Narayana

Leave a Comment