హైద్రాబాద్ వార్తలు

న్యూయార్క్, టోక్యో నగరాలతో దీటుగా హైదరాబాద్…సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం జూ పార్క్ – ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభించారు సీఎం. రూ. 636 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ 24 మీటర్ల వెడల్పు, 4.4 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతోందని..న్యూయార్క్, టోక్యో నగరాలతో సమానంగా హైదరాబాద్ ను నడిపిస్తామని అన్నారు. హైదరాబాద్ లో అద్భుతమైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు సీఎం రేవంత్. రూ.7 వేల కోట్లతో హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్న సహచరులకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్త సాంకేతిక అభివృద్ధిలో హైదరాబాదీల పాత్ర ఉందని.. దేశానికి కంప్యూటర్ ను రాజీవ్ గాంధీ పరిచయం చేశారని అన్నారు సీఎం రేవంత్. ఔటర్ రింగురోడ్డు, ఫార్మా కంపెనీలు కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ కు వచ్చాయని అన్నారు. నగరంలో పేదలకోసం పీజేఆర్ పోరాడారని అన్నారు. హైదరాబాద్ లో తాగునీటి సమస్యను తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు సీఎం రేవంత్.

Related posts

న‌ల్ల‌చెరువులో ఆక్ర‌మ‌ణ‌ల‌ను మేం తొలగించలేదు… వారే వెళ్లిపోయారు: హైడ్రా

Ram Narayana

అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌డే చేసుకున్న రోజే విషాద ఘ‌ట‌న‌!

Ram Narayana

న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు: హైదరాబాద్ సీపీ సజ్జనార్

Ram Narayana