Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ పాలన పట్ల 100 శాతం ప్రజలు సంతోషంగా ఉంటారనుకోవడం లేదు: భట్టి విక్రమార్క

  • ప్రజాస్వామ్యం అంటేనే కొంత వ్యతిరేకత ఉంటుందన్న భట్టి విక్రమార్క
  • 50 శాతానికి పైగా ప్రజలు పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారన్న డిప్యూటీ సీఎం
  • కేబినెట్ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి

ప్రభుత్వ పాలన పట్ల 100 శాతం ప్రజలు సంతోషంగా ఉంటారని తాను భావించడం లేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాపాలన పట్ల ఎక్కువమంది ప్రజలు మాత్రం సంతోషంగా ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం అంటేనే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందన్నారు. తమ ఏడాది పాలనపై రాష్ట్రంలోని 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆక్రమణలను ఆపేందుకే హైడ్రా అన్నారు. హైడ్రాకు పేద, ధనిక అనే తేడా ఉండదన్నారు. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదన్నారు. మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Related posts

రాష్ట్రాభివృద్ధికి సైంధవుల్లా అడ్డుపడుతున్న కేసీఆర్ ,కిషన్ రెడ్డి …సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ …

Ram Narayana

భద్రాచలం ఆలయంలో విమానం వెళ్తున్నట్టు వింత శబ్దాలు.. భయపడుతున్న భక్తులు

Ram Narayana

ఆత్మగౌరవ నినాదం …తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు జై అన్న పొంగులేటి , జూపల్లి …

Drukpadam

Leave a Comment