తెలంగాణ వార్తలు

టీయూడబ్ల్యూజే పోరాటాలు ఆకర్షించాయి..

దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ-IJU) అవిశ్రాంతంగా పోరాడడం తమను ఎంతో ఆకర్షించిందని, ఈ నేపథ్యంలోనే ఆ సంఘానికి అనుబంధంగా పనిచేసేందుకు తమ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని తెలంగాణ వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ బాధ్యులు వెల్లడించారు.
శనివారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి హరీష్ లు తమ నిర్ణయాన్ని సభా ముఖంగా ప్రకటించి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీకి లేఖను అందించారు.ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ వీడియో జర్నలిస్టులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. వీడియో జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజె ఉప ప్రధాన కార్యదర్శి కె రాములు, కార్యదర్శులు వి.యాదగిరి, కె.శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరి, హెచ్.యూ.జె.అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి హరిప్రసాద్, టీయూడబ్ల్యూజె మహిళ విభాగం బాధ్యురాలు కల్యాణం రాజేశ్వరిలతో పాటు వీడియో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ఉద్యోగాన్ని కాదని సర్పంచ్‌గా గెలిచిన బీటెక్ యువతి.. 21 ఏళ్లకే గ్రామ సారథిగా!

Ram Narayana

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Ram Narayana

గోదావరిపై నౌకా యానం కోసం అధ్యయనం చేయాలి

Ram Narayana